కేజీబీవీ అండ్ యు ఆర్ ఎస్ సిబ్బందికి కనీస వేతనం చెల్లించాలి

– టీఎస్ యుటిఎఫ్ నాయకుల డిమాండ్
నవతెలంగాణ – కంటేశ్వర్
కేజీబీవీ అండ్ యు ఆర్ ఎస్ సిబ్బందికి కనీస వేతనం చెల్లించాలని టిఎస్ యుటిఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం
అనాధ, వెనకబడిన బాలికలకు విద్యను అందించడం కోసం 2013లో ఏర్పాటు చేయబడిన కస్తూరిబా బాలిక విద్యాలయాల్లో అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది సేవలను రెగ్యులరైజ్ చేయాలని, అప్పటివరకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి వారి పోస్టు యొక్క కనీస వేతనాన్ని చెల్లించాలని, ఇతర పెండింగ్ సమస్యలను పరిష్కరించమని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (TSUTF) రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో (22.05.2023) మండుటెండలో పాత కలెక్టరేట్ ఎదుట కేజీబీవీ యుఆర్ఎస్ (అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్) బోధన, బోధనేతర సిబ్బంది ధర్నా నిర్వహించారు. ఈ సంద్భంగా టీ ఎస్ యూటీఫ్ రాష్ట్ర కార్యదర్శి డి.సత్యానంద్ మాట్లాడుతూ.. కేజీబీవీ, యు ఆర్ ఎస్ సమస్యలను ప్రభుత్వం, అధికారులు స్పందించి సత్వరం సమస్యలను పరిష్కరించాలని, లేనియెడల జూన్ ఎనిమిదో తేదీన హైదరాబాదులో ధర్నా నిర్వహిస్తామని చెప్పారు.
కేజీబీవీ, యు ఆర్ ఎస్ సిబ్బందికి కనీస వేతనాలను అమలు చేయకపోవడంతో శ్రమ దోపిడీకి గురవతున్నారని, సెలవు నిభందనలు అమలు చేయాలని, పిల్లల సంఖ్య కు తగినట్లుగా సిబ్బందిని నియమించాలని, హెల్త్ కార్డులు జారీ చేయాలని, నైట్ డ్యూటీ నుండి విముక్తి చేయడానికి కేర్ టేకర్లను నియమించాలని, పార్ట్ టైం ఉద్యోగులను ఫుల్ టైం సి ఆర్ టి లుగా గుర్తించాలని, యు ఆర్ ఎస్ లలో తొమ్మిది, పది తరగతులను ప్రారంభించాలని, సొంత భవనలను నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీ ఎస్ యూటీఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్, ఉపాధ్యక్షులు సిరాజుద్దిన్, జిల్లా కార్యదర్శులు గంగాధర్, రాజారాం, కేజీబీవీ అండ్ యు ఆర్ ఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Spread the love