Sunday, July 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కేటీఆర్ పర్యటన.. పరకాలలో ఘనస్వాగతం

కేటీఆర్ పర్యటన.. పరకాలలో ఘనస్వాగతం

- Advertisement -

నవతెలంగాణ – పరకాల 
కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన నిమిత్తం వెళ్తున్న బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు పరకాల నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ఆయన రాక సందర్భంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ నాయకుడికి నీరాజనాలు పట్టారు. ఈ సందర్భంగా పరకాల పట్టణానికి చేరుకున్న కేటీఆర్, స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడ ఉన్న నాయకులు, కార్యకర్తలతో కొద్దిసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -