Sunday, July 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ మండలాధ్యక్షునిగా తానెం సుధాకర్

కాంగ్రెస్ మండలాధ్యక్షునిగా తానెం సుధాకర్

- Advertisement -

నవతెలంగాణ-నవాబుపేట
మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కూచూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి అతి సన్నిహితుడైన తానేం సుధాకర్ ను కాంగ్రెస్ పార్టీ అధికారికంగా నియమిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకుడు పార్టీ కోసం పాటుపడిన వ్యక్తికి అధ్యక్ష పదవి ఇవ్వడం పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు, హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తానేం సుధాకర్ కు జిల్లా ,మండల వ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ తనకు బాధ్యతలు ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అర్హులైన వారికి అందేలా కృషి చేస్తానని చెప్పారు.

పార్టీని మరింత బలోపేతం చేసి, ప్రజలకు చేరువ చేసేలా కృషి చేస్తారనే నమ్మకాన్ని నాయకులు వ్యక్తం చేశారు.తనపై నమ్మకం ఉంచి మండల అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన పార్టీ జిల్లా, మండల నాయకత్వానికి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి, మంత్రి  వాకిటి శ్రీహరికి , దుష్యంత్ రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఈ అవకాశం కల్పించడం గొప్ప బాధ్యతగా భావిస్తున్నానని కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఆశయాలను ప్రతి గ్రామ గ్రామానికి తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. మండలంలోని ప్రతి గ్రామంలో పార్టీని మరింత బలోపేతం చేసి కార్యకర్తలకు అండగా నిలుస్తానని, ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. పార్టీ అభివృద్ధికి కార్యకర్తలే వెన్నెముక అని పేర్కొన్న ఆయన అందరినీ సమన్వయం చేసుకుంటూ ఐక్యతతో ముందుకు సాగుతానని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -