వారం రోజులు అప్పగిస్తే రాష్ట్రమంతా నీళ్లు పారిస్తాం
మేడిగడ్డతో అవసరం లేకుండానే కన్నెపల్లి నుంచి నీటి తరలింపు సాధ్యం
ప్రభుత్వం స్పందించకుంటే
50వేల మందితో పంప్‌హౌస్ ముట్టడి : బీఆర్ఎస్ వర్కింగ్
ప్రెసిడెంట్ కేటీఆర్ పంప్‌హౌస్ పరిశీలన
నవతెలంగాణ -
మహదేవపూర్/ జనగామ/అదిలాబాద్
కేసీఆర్‌పై ఉన్న రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్లను నడపడంలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నేతల బృందం జయశంకర్
భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కన్నెపల్లి పంప్‌హౌస్‌ను సందర్శించింది.. ఈ సందర్భంగా
ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ ప్రస్తుతం 98వేల క్యూసెక్కుల గోదావరి నీరు వృథాగా సముద్రంలో కలుస్తోందని తెలిపారు. ఎంతటి కరువులోనైనా నీటి నిల్వ ఉండే అద్భుతమైన ప్రాంతం కన్నెపలి అని, మేడిగడ్డ బ్యారేజీతో అవసరం లేకుండానే కన్నెపల్లి పంప్‌హౌస్ మోటార్లు ఆన్ చేసి ఫ్లడ్ ఫ్లో ద్వారా మిడ్ మా నేరు, ఎస్సారెస్పీ, ఎల్లంపల్లికి నీటిని తరలించవచ్చని పేర్కొన్నారు. నీళ్లు ఇవ్వాలని రైతులు, మాజీ మంత్రులు గంగుల కమలాకర్, రసమయి బాలకి షన్ కోరినా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. కన్నెపల్లి పంపులు ఆన్ చేస్తే నీళ్లు వస్తాయనే విషయం కాంగ్రెస్ నాయకులకు కూడా తెలుస న్నారు. ఒకవేళ నీళ్లిస్తే రైతులకు యూరియా, మద్దతు ధర, బోనస్, 24 గంటల కరెంట్ ఇవ్వాల్సి వస్తుందనే భయంతోనే రేవంత్ రెడ్డి సర్కార్ మోటా ర్లు ఆన్ చేయడం లేదని ఆరోపించారు. ఎన్డీఎస్ఏ నివేదికలను అడ్డం పెట్టుకు ని ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తోందన్నారు. కేసీఆర్‌కు వారం రోజు లు కాళేశ్వరం ప్రాజెక్టును అప్పగిస్తే రాష్ట్రమంతటా నీళ్లు పారిస్తామని సవాల్ విసిరారు.
హైదరాబాద్‌కు తాగునీటి సంక్షోభం
రాష్ట్రంలో 26 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని, ఎల్‌నినో ప్రభావం ఉంటుందని తాము మూడు నెలల క్రితమే హెచ్చరించామని కేటీఆర్ గుర్తు చేశారు. ఉమ్మడి ఏడు జిల్లాలకు సాగునీటితో పాటు హైదరాబాద్ కు తాగునీరు అందించే సామర్థ్యం కాళేశ్వరానికి ఉందన్నారు. కాంగ్రెస్ చేతకానితనం వల్ల ప్రాజెక్టును పడావు పెట్టడంతో హైదరాబాద్‌లో రోజుకు 15 వేల వాటర్ ట్యాంకర్లు తిరుగుతున్నాయని అన్నారు. త్వరలోనే తీవ్ర తాగునీటి సంక్షోభం వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రూ.94 వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే .. అందులో రూ. లక్ష కోట్ల అవినీతి జరిగిందని ప్రచారం చేయడంపై కేటీఆర్ మండిపడ్డారు. ‘సీఎం రేవంత్‌రెడ్డికి సోయి … మంత్రి ఉత్తమ్కఁమార్రెడ్డికి స్పహ ఉందా..అని ప్రశ్నించారు. కాళేశ్వరం వల్లే రాష్ట్రం వరి ఉత్పత్తిలో పంజాబ్‌ను దాటి నెంబర్ వన్ స్థానాని కి చేరిందని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో సుంకిశాల గోడ కూలినా, వట్టెం పంప్‌హౌస్ కొట్టుకుపోయినా, ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలి ఎనిమిదిమంది చనిపోయినా పట్టించుకోని ప్రభుత్వం, కాళేశ్వరంపై మాత్రం విషం చిమ్ముతోందని ధ్వజమెత్తారు. కక్షపూరిత రాజకీయాలు పక్కన పెట్టి కన్నెపల్లి మోటర్లు నడపాలని, లేనిపక్షంలో 50 వేల మంది రైతులతో కలిసి పంప్‌హౌస్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. పర్యటనలో మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రులు గంగుల కమలాకర్, జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుతో పాటు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకఁలు, ప్రజలు పాల్గొన్నారు.
కన్నెపల్లి పంప్ హౌస్ పర్యటన ఉద్రిక్తం
కేటీఆర్ కన్నెపల్లి పంప్ హౌస్ పర్యటన సందర్భంగా జనగామ జిల్లా పెంబర్తి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పంప్‌హౌస్ సందర్శనకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన కేటీఆర్ కాన్వాయిను పెంబర్తి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు అడ్డుకున్నారు. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై భారీ సంఖ్యలో పోలీసులు మోహరించి, కేటీఆర్‌తో పాటు వస్తున్న బీఆర్ఎస్ నాయకఁలు, కార్యకర్తలు, రైతుల వాహనాలను పలుచోట్ల నిలిపివేశారు. పెంబర్తి వద్ద రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు ఏర్పాటు చేయడంతో కేటీఆర్ కాన్వాయి ముందుకు సాగలేకపోయింది. దీంతో కేటీఆర్ వాహనం దిగి పోలీసు అధికారులతో మాట్లాడారు. అంతలో అక్కడికి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. దీంతో రహదారిపై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అదనపు పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని చక్కదిద్దారు.
బీఆర్ఎస్ నేతల అరెస్ట్
కేటీఆర్‌కు స్వాగతం పలికేందుకు వెళ్తున్న హనుమకొండ జిల్లా ఆత్మ కూరు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. గుడ్డెప్పడ్ జంక్షన్ వద్ద స్వాగతం పలికేందుకు వెళ్తుండగా ఆత్మకూర్ పోలీసులు వారిని అదుపు లోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో మాజీ వైస్ ఎంపీపీ రేవూరి సుధాకర్ రెడ్డి, ఉపసర్పంచ్ బాషబోయిన పైడి, రేవూరి సంపత్ రెడ్డి, నాయకులు వంగల భగవాన్ రెడ్డి, మాజీ అధ్యక్షఁడు పాపానీ రవీందర్ ఉన్నారు. కన్నెపల్లి పంప్ హౌస్‌ను సందర్శించేందుకు వెళ్తున్న మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన వారిలో కంబగొని సుదర్శన్ గౌడ్, వంశీకృష్ణ, రేవెల్లి ఓదెలు, ఖలీం, రామిడి లక్ష్మీకాంత్, కరుణాకర్, శివ, మణికుమార్, అవినాష్ ఉన్నారు.



