బీఆర్‌ఎస్‌ ఓటమికి ఇవీ కారణాలే!

These are the reasons for the defeat of BRS!తెలంగాణ సాధించి పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ ఎస్‌ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలవటం స్వయం కృతమే. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ నినాదంతో ప్రత్యేక రా ష్ట్రాన్ని సాధించడంలో కీలకపాత్ర వహించిన నేత అదే ప్రజల ఆత్మగౌరవాన్ని ఘోరంగా గాయపరచడంతోనే ఈ ఫలితం సం భవించింది అనేది జనవాక్కు. ”నీళ్లు, నిధులు, నియామకాలు” నినాదంతో అధికారం చేపట్టిన కేసీఆర్‌ నియామకాలను పూర్తి గా విస్మరించారు. మరోపక్క ఉద్యోగ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెబుతూనే ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్యంగా ఉండటం తో పాటు, సంఘాలను నిర్వీర్యం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ విధానం లేకుండా చేస్తా నన్న మాటను గాలికి వదిలేశారు. తెలంగాణ సాధనలో కీలక భూమిక పోషించిన ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిం చారు. ”ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల సివిల్‌ సర్వీసెస్‌ జా యింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ను” పునరుద్ధరించలేదు. ఉమ్మడి రాష్ట్రం లో అందులో ఉన్న సభ్య సంఘాలకు సకాలంలో అదర్‌ డ్యూటీ సౌకర్యం, ఓడి కల్పించలేదు. అనేక ఏండ్ల పాటు పోరాటం చేసి తెలంగాణ సాధించామని చెప్పుకున్నవారు అధికారంలోకి వచ్చా క శ్రామిక ప్రజలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ సమ స్యల్ని పరిష్కరించమని వేడుకుంటే ఆలకించలేదు. నిరసనలు, ధర్నాలు, పోరాటాలు చేస్తే కఠినంగా అణిచివేశారు. నిరసన తెలియజేసేందుకు కూడా అవకాశం లేకుండా ఇందిరాపార్క్‌ వద్ద ధర్నా చౌక్‌ను ఎత్తివేశారు.
నూతన రాష్ట్రం ఏర్పడిన సందర్భంలో కాంట్రిబ్యూటరీ పె న్షన్‌ విధానం నుంచి బయటికి వచ్చి పాత పెన్షన్‌ విధానం అ మలు చేసే అవకాశం ఉన్నప్పటికీ ఉద్యోగ సంఘాలతో కనీసం మాట మాత్రంగా కూడా చర్చించకుండానే సీపీఎస్‌ అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది. ఉద్యోగ ఉపాధ్యాయు ల విద్యారంగ సమస్యల పరిష్కారంలోనూ అంతే సాచివేత వైఖ రిని కనబరిచింది. పే రివిజన్‌ కమిటీ, ఐ.ఆర్‌ ప్రకటించే సంద ర్భంలో కూడా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో చర్చించకుం డా ఏకపక్షంగా, నియంతత్వంగా వ్యవహరించారు. టీఎన్జీవో, టీజీవో, మరికొన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులను చేర దీసి తమ సమస్యల పట్ల నిరసన తెలియజేయకుండా చేయగ లిగారు. ఉద్యోగ ఉపాధ్యాయుల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఏర్పడకుండా చేయడంలో విజయవంతమయ్యారు. కొందరు నాయకుల వ్యక్తిగత ప్రయోజనాలను నెరవేరుస్తూ, వారి బలహీ నతలను ఆసరా చేసుకుని ఆ సంఘాలను నిర్వీర్యం చేసారు. ముఖస్తుతి చేసే నాయకుల మాటలు నమ్మి ఉద్యోగుల ఆగ్ర హాన్ని ప్రభుత్వం పసిగట్టలేదు. ఆ సంఘాలు, నాయకులే మళ్లీ నూతన ప్రభుత్వం పంచన కూడా చేరి తప్పు దారి పట్టించే ప్రయత్నం చేస్తారనడంలో సందేహం లేదు! నూతన ప్రభుత్వం వారి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది.
2018 పీఆర్‌సీని 2020 ఏప్రిల్‌ నుంచి అమలు చేసి 21 నెలల పీఆర్‌సీ ప్రయోజనాలను కృష్ణార్పణం అన్నారు. రెండు నెలల బకాయిలను 18 వాయిదాలలో చెల్లిస్తామని చెప్పి ఈ నాటికీ పూర్తిగా చెల్లించని పరిస్థితి. ఉద్యోగ ఉపాధ్యాయులకు కేంద్రం, మరికొన్ని రాష్ట్రాలు మనకన్నా ఎక్కువ వేతనాలు చెల్లి స్తున్నప్పటికీ ‘దేశంలో అందరి కన్నా మన ఉద్యోగులకే ఎక్కువ జీతాలు చెల్లిస్తున్నాం’ అంటూ చౌకబారు ప్రచారం చేస్తూ ఉద్యో గులపై ప్రజలకు ద్వేషం పెంచే ప్రయత్నం చేశారు. ఈ నేప థ్యంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయులు ఈ ప్రభుత్వంపై పెద్దఎత్తున ఆగ్రహం తెలియ జేశారు. 1,71,370 ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్స్‌లో సింహ భాగం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేశారంటే గత ప్రభుత్వంపై ఉద్యోగ ఉపాధ్యాయులు ఎంత అసంతృప్తిగా, ఆగ్రహంగా ఉ న్నారో అర్థం చేసుకోవచ్చు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించలేకపోవడం, జీతాలు ఒకటో తేదీన చెల్లించండి మహా ప్రభో అని అడిగితే ”కాస్త ఆలస్యం అయితే చచ్చిపోతారా?” అనే విధంగా మాట్లాడటం, ఏరియర్‌ బిల్స్‌, జిపిఎఫ్‌, టిఎస్జిఎల్‌ఐ, సరెండర్‌ లీవ్‌ వం టివి సకాలంలో చెల్లించకపోవడం, రిటైర్‌ అయిన సందర్భంలో పెన్షన్‌, గ్రాట్యూటీ, క మ్యూటేషన్‌ ఇతర బకాయిల కోసం నెలల తరబడి వేచి చూడాల్సిన దుస్థితి నెలకొంది. ”ఉద్యోగులు తమ పిల్లల పెండ్లి ఖర్చులకు జీపీఎఫ్‌ లోన్‌ పెట్టుకుంటే బారసాల నాటికి గాని రావు” అని ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎగతాళిగా చర్చించుకోవడం పరిస్థితికి చక్కని ఉదాహరణ.
రాష్ట్రం ఏర్పడితే కార్మికుడి కొడుకు మొదలు కలెక్టర్‌ కొడు కు వరకు అందరికీ ఒకే విధమైన, నాణ్యమైన, ఉచిత విద్యను అందించే విధంగా ”కేజీ టు పీజీ విధానం” తీసుకువస్తామని ప్రకటించిన ఉద్యమ కాలంనాటి మాటలు నీటి మూటలు కావడం కూడా బీఆర్‌ఎస్‌ ఓటమికి మరో కారణం. కులాల పేరుతో 750 గురుకులాలు స్థాపించి అదే ‘కేజీ టు పీజీ’ అని నమ్మించ చూడటం విస్తుగొలుపుతుంది. వాటిలో అయినా పూర్తిస్థాయిలో మౌలిక సౌకర్యాలు, ఉపాధ్యాయ నియామకాలు చేపట్టలేదు. మన రాష్ట్రంలో 60 లక్షల మంది బడీడు పిల్లలు ఉండగా, నాలుగున్నర లక్షలమంది పిల్లలకు గురుకులాల్లో చదువు చెప్పించి, ఇతర ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకో కుండా, వాటిలో ఉపాధ్యాయ పోస్టులు నింపకుండా మిగిలిన పిల్లల్ని ప్రయివేట్‌ పాఠశాలల దయాదాక్షిణ్యాలకు వదిలేయడం ఏ మాత్రం భావ్యమో ఆలోచించాలి? పదేండ్ల కాలంలో ఒకే ఒక్కసారి ఉపాధ్యాయ నియామకాలు చేపట్టారంటే విద్యారం గం పట్ల వారి చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు. పరిస్థితి మీద ముఖ్యమంత్రి స్థాయిలో ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదంటేనే విద్యారంగం పట్ల నాటి ప్రభుత్వ చిత్తశుద్ధి ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు.
అందరికీ సమానమైన విద్యను అందించే విధంగా కామన్‌ స్కూల్‌ విధానాన్ని అమలు చేయాలని, గురు కులాలను కులాల ప్రాతిపదికన కాకుండా కామన్‌ డైరె క్టరేట్‌ పరిధిలోకి తీసుకురావాలని, పాఠశాలలకు మౌలి క సౌకర్యాలు కల్పించాలని, తరగతి గదులను, మరు గుదొడ్లను శుభ్రంగా ఉంచడానికి సర్వీస్‌ పర్సన్స్‌ను నియమించాలని, విద్యావాలంటీర్లను నియమించాలని టీఎస్‌ యుటిఎఫ్‌, యూస్‌పీఎస్‌ చేసిన ప్రతిపాదనలు పట్టించుకోలేదు. రెండు పేజీల్లో ఉపాధ్యాయుల సర్వీస్‌ రూల్స్‌ రూపొందించుకుందామని చెప్పిన ముఖ్యమంత్రి ”కామన్‌ సర్వీస్‌ రూల్స్‌కు అనుగుణంగా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పువచ్చి, దానికి అనుగుణంగా రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చినా, దాన్ని అమలు చేయడంలో చూపిన అశ్రద్ధ వల్ల తిరిగి రాష్ట్ర హైకోర్టు కొట్టేసే పరిస్థితి దాపురించింది. ఫలితంగా ఏండ్ల తరబడి ఉపాధ్యాయులకు ప్రమోషన్లు కల్పించుకోలేని దుస్థితి నెలకొంది.
ఉపాధ్యాయులకు సకాలంలో ప్రమోషన్లు లేవు, బదిలీలు లేవు, 317 జీవోతో ఉపాధ్యాయుల్ని చెట్టుకొకరు, పుట్టకొకరుగా చేసిన పరిస్థితి. ఆరేండ్ల క్రితం అప్‌గ్రేడ్‌ చేసిన భాషా పండితు లు, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులకు ప్రమోషన్లు ఇవ్వని పరి స్థితి, 5వేల పీఎస్‌హెచ్‌ఎం పోస్టులు సృష్టిస్తానని పట్టించుకోలే దు. రాష్ట్రంలో పాఠశాలల పర్యవేక్షణ అధికారుల పోస్టులు దా దాపు అన్నీ ఖాళీగా ఉన్న స్థితి. ఉత్తర్వులు ఇచ్చి కూడా ప్ర మో షన్లు, బదిలీలు అమలు చేయలేనటువంటి అసమర్థత. సీఎంఓ అనుమతి లేకుండా విద్యాశాఖ మంత్రి గానీ, అధికారులు కానీ చిన్న నిర్ణయం కూడా తీసుకునే స్వేచ్ఛ లేదు. వీటన్నింటి నేప థ్యంలో కేసీఆర్‌ ప్రభుత్వాన్ని సాగనంపి నూతన ప్రభుత్వానికి పట్టం కట్టారు. పై విషయాలను నూతన ప్రభుత్వం దృష్టిలో ఉంచుకుని గతంలోలా కాకుండా మెరుగైన పాలనందించాలి. విద్యారంగాన్ని కొత్తపుంతలు తొక్కించాలి. ఉద్యోగ ఉపాధ్యా యులకు అండగా నిలవాలి. పెండింగ్‌లో ఉన్న వారి సమస్యలు పరిష్కరించి కొండంత అండగా తామున్నా మనే భరోసానివ్వా లి. అప్పుడే ఉద్యోగ, ఉపాధ్యాయులు కూడా కొత్త ప్రభుత్వానికి సహకరిస్తారు. లేదంటే షరామామూలే!

– జి.వి.నాగమల్లేశ్వరరావు
9676960880

Spread the love