Thursday, March 5, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవీఎన్‌ఆర్‌ వీజేఐఈటీ గుర్తింపును రద్దు చేయాలి

వీఎన్‌ఆర్‌ వీజేఐఈటీ గుర్తింపును రద్దు చేయాలి

- Advertisement -

– రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

బాచుపల్లిలోని విఎన్‌ఆర్‌ విజ్ఞాన జ్యోతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ గుర్తింపును రద్దు చేయాలని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర నాయకులు దేవరాల రాకేశ్‌ కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. మహిళా విద్యార్థిపై జరిగిన లైంగిక వేధింపుల ఘటనపై ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. మహిళల భద్రత విషయంలో కళాశాల యాజమాన్యం తీవ్రమైన నిర్లక్ష్యం చూపిస్తోందని ఆరోపించారు. యాజమాన్యం బాధ్యతారాహిత్యం కారణంగానే దుర్ఘటన జరిగిందని పేర్కొన్నారు. 2021లోనూ ఈ కళాశాలలో ఒక మహిళా విద్యార్థి హత్యకు గురైన ఘటనపై ఆరోపణలున్నాయని గుర్తు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -