ఆస్పత్రుల్లో ప్రొఫెసర్స్ లేకుండా అధ్యయనం, మెరుగైన చికిత్సలు ఎలా ?
రాష్ట్రమంతా ఖాళీగా వైద్య పోస్టులు
మెడికల్ కళాశాలలో బోధనకు గురువుల కొరత: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
సీపీఐ(ఎం) బృందంతో వనపర్తి జనరల్ ఆస్పత్రి సందర్శన
నవతెలంగాణ- వనపర్తి
నిరుపేదలకు జిల్లా ఆస్పత్రుల్లోనూ అత్యాధునిక వైద్య సేవలు అందించాలని, వైద్య కళాశాలలు, ఆస్పత్రుల్లో ఖీళీలను భర్తీ చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. పీఐ(ఎం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రిని జాన్ వెస్లీ మంగళవారం సందర్శించారు. ఆస్పత్రిలో జనరల్, గైనిక్, చిడ్రన్స్ వార్డులను సందర్శించి రోగులతో మాట్లాడారు. అనంతరం రక్త పరీక్షల కేంద్రాన్ని, మందులు సరఫరా చేసే విభాగాన్ని, భోజనశాలను పరిశీలించారు. ఆసుపత్రి ఆర్‌ఎంఓ ప్రసాద్‌ను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా, వైద్య రంగాల్లో జరుగుతున్న లోపాలను సరిదిద్దాలన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఖీళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యా, వైద్య రంగాల్లో నెలకొన్న సమస్యలు, ప్రజల అవసరాలను తెలుసుకునేందుకు సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ, జిల్లా బృందాలు క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించాయని తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు రెండు నెలలపాటు అన్ని విద్యాలయాలు, ప్రభుత్వ ఆస్పత్రులను పరిశీలించామన్నారు. పరిశీలన చేసిన సమస్యలపై అధ్యయనం చేస్తున్నామన్నారు.
స్థానిక సమస్యలను ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి స్థాయి వరకు తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేయబోతున్నమన్నారు. తెలంగాణ వచ్చాక ప్రతి జిల్లాకో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారనాన్నారు. అలాగే జిల్లా కేంద్రాల్లోని ఏరియా ఆస్పత్రులను జనరల్ ఆస్పత్రులుగా అప్ గ్రేడ్ చేశారని తెలిపారు. కానీ వైద్య కళాశాలలు, జనరల్ ఆస్పత్రులకు అనుగు ణంగా అవసరమైన వైద్య బృందాన్ని నియమిం చడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం కనిపిస్తోందని మండిపడ్డారు. వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు సరైన బోధన లేకపోతే పట్టా చేత పట్టుకొని బయటికి వచ్చాక వారు రోగులకు ఎలాంటి వైద్యం అందించగలుగుతారని ప్రభుత్వా న్ని ప్రశ్నించారు. అలాగే ఏరియా జనరల్ ఆస్పత్రుల్లో నిరంతరం వైద్య సేవలతో పాటు క్లిష్టమైన వైద్య సేవలను అందించే స్పెషలిస్టు డాక్టర్లు, ప్రొఫెసర్లు, అసిస్టెంట్, ప్రొఫెసర్లు, అసోసియేట్లను నియమించకపోతే వైద్యరంగం ఎలా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు. ప్రతి మనిషికీ విద్యా, వైద్యం ప్రాథమిక హక్కుగా ప్రభుత్వాలు అందించాల్సిన బాధ్యత ఉందని సూచించారు. జిల్లా ఆసుపత్రిలో 11 డిపార్ట్‌మెంట్లో జనరల్, ఎంసీహెచ్ ఆసుపత్రుల్లో మొత్తం 330 పడకలతో వైద్య సేవలు అందించే అవకాశం ఉన్నప్పటికీ సరైన సదుపాయాలు, వైద్యుల్లేని కారణంగా వైద్యం అందట్లేదన్నారు.
అనస్తీసియా పీడియాట్రిక్, కంటి వైద్యానికి సంబంధించి రెగ్యులర్ డాక్టర్లు లేరన్నారు. ల్యాబ్ టెక్నీషియన్స్ అవసరం మేరకకు లేకపోవడం వల్ల సకాలంలో వైద్య పరీక్షలు జరగట్లేదన్నారు. వనపర్తి జిల్లా కేంద్రానికి వనపర్తితోపాటు నాగర్‌కర్నూల్, గద్వాల జిల్లాలకు సంబంధించిన పేషెంట్లు కూడా వస్తుండడంతో ఓపి రిజిస్ట్రేషన్ కేంద్రాలను అదనంగా పెంచాలన్నారు. 12 ఫార్మాసిసు, 10 ల్యాబ్ టెక్నీషియన్స్, 40 స్టాఫ్‌నర్స్ పోస్టులు ఖాళీగా ఉన్నంటున వెంటనే భర్తీ చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగంలో అవసరమైన పోస్టులను భర్తీ చేసి వైద్య విద్యార్థులతో పాటు రోగులకు మెరుగైన, అత్యాధునిక యంత్రాల విఁయోగంతో మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి జబ్బార్, డి బాల్ రెడ్డి, గోపి, జిల్లా కమిటీ సభ్యులు రాజు, టౌన్ కార్యదర్శి పరమేశ్వర చారి, సీనియర్ నాయకఁలు డి కఁరుమయ్య, బాలరాజు, బాలస్వామి నాయకఁలు బీసన్న, దేవేంద్రం తదితరులు పాల్గొన్నారు.



