డీలిమిటేషన్, జనగణనతో ముడిపెట్టొద్దు
ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఆమోదించాలి
ఐద్వా అఖిల భారత అధ్యక్షులు పీకే శ్రీమతి, ఉపాధ్యక్షులు పుణ్యవతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను వెంటనే వర్తింపజేయాలనీ, ఈ నెల 20 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లోనే కేంద్ర ప్రభుత్వం వాటికి ఆమోదం తెలపాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) అఖిల భారత అధ్యక్షులు పీకే శ్రీమతి, ఉపాధ్యక్షులు పుణ్యవతి డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని డీలిమిటేషన్, జనగణనతో ముడిపెట్టొద్దని కోరారు. బుధవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాగ్ లింగంపల్లి చౌరస్తాలో ఐద్వా ఆధ్వర్యంలో మానవహారాన్ని నిర్వహించారు. ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, అధ్యక్షులు ఆర్.అరుణజ్యోతి, ఉపాధ్యక్షులు టి.జ్యోతి, కోశాధికారి మాచర్ల భారతి, సహాయ కార్యదర్శులు కెన్. ఆశలత, బుగ్గవీటి సరళ, పి ప్రభావతి, కె. నాగలక్ష్మి, ఎన్ రత్నమాల, రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి పద్మ, పి శశికళ, ఎం.వినోద, బట్టుపల్లి అనురాధ, షబానా, వై. వరలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీమతి, పుణ్యవతి మాట్లాడుతూ…దేశ జనాభాలో సగ భాగంగా ఉన్న మహిళలకు రాజకీయాల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించడం ప్రజాస్వామ్యానికి అత్యంత అవసరమని నొక్కి చెప్పారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఆమోదించి జాప్యం లేకుండా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల అమలు కోసం జాతీయ స్థాయిలో పోరాడేందుకు మహిళా సంఘాలతో కోఆర్డినేషన్ కమిటీగా ఏర్పడ్డామన్నారు. రాజ్యాంగ స్ఫూర్తితో మహిళలకు సమాన అవకాశాలు, సమాన ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. 33 శాతం రిజర్వేషన్లు ప్రస్తుతమున్న పార్లమెంటు స్థానాలలోనే కల్పించాలనీ, బిల్లును తక్షణమే అమలు చేసేలా ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు వర్తింపజేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



