Thursday, July 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకేంద్రం కుట్రలను తిప్పి కొట్టాలి

కేంద్రం కుట్రలను తిప్పి కొట్టాలి

- Advertisement -

ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లను కాపాడుకోవాలి
నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చాం..కార్మికులకు భరోసా కల్పిస్తూ
నిర్ణయాలు : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌
నాగర్‌కర్నూల్‌ బస్టాండ్‌కు శంకుస్థాపన
నవతెలంగాణ-
మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి

కేంద్ర ప్రభుత్వం తనకు అనుకూలమైన రాజకీయ వాతావరణాన్ని కల్పించుకోవడానికే ‘సర్‌’ను ఒక వేదికగా ఉపయోగించుకుం టుందనీ, ప్రజాస్వామ్య బద్ధంగా ఓట్లను కాపాడుకోవాల్సిన అవసరముందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. బుధవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో ఆర్జీసీ బస్సు డిపో దగ్గర నూతన బస్టాండుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ పదేండ్ల పాలనలో ఆర్టీసీని విధ్వంసం చేసేలా చర్యలు తీసుకుందని, 53 రోజులపాటు కార్మికులు సమ్మె చేసినా ఏమాత్రం పట్టించుకోకుండా పదుల సంఖ్యలో కార్మికుల మరణానికి కారణమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఆర్టీసీ కార్మి‌కులకు భరోసా కల్పిస్తూ నిర్ణయాలు చేయడంతో పాటు కారుణ్య నియమాకాలు, పీఎఫ్‌ ‌సదుపాయం కల్పిస్తూ చర్యలు తీసుకున్నామన్నారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ అవకాశం కల్పించిన తర్వాత మహిళలకు వేల కోట్ల రూపాయల ఆదా కలిగిందన్నారు. ప్రతి మండల మహిళా సమాఖ్యను ఆర్టీసీ బస్సులకు ఓనర్లను చేశామని గుర్తు చేశారు. దేశంలోనే అతిపెద్ద సంస్థగా ఆర్టీసీని పురోగతిలోకి తెచ్చామన్నారు. రాష్ట్రంలో 10173 బస్సులు, 97 డిపోలు, 364 బస్‌ స్టేషన్లు ఉన్నాయని తెలిపారు. ప్రతిరోజు రాష్ట్రవ్యాప్తంగా 60 లక్షల మందిని తమ తమ గమ్యాలకు చేరుస్తున్నామన్నారు. మహిళలకు 600 బస్సులు ఇచ్చామని, భవిష్యత్‌‌లోనూ బస్సు ఏదైనా మహిళలకే యాజమాన్య అవకాశం కల్పిస్తామన్నారు. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామన్నారు. తమ ప్రభుత్వం రవాణా సంక్షేమం, అభివృద్ధి అనే రెండు అంశాలపై ముందుకు వెళుతుందని అభిప్రాయపడ్డారు. నాగర్‌కర్నూల్‌ పట్టణంలో 200 కోట్లు వెచ్చించి జనరల్‌ ఆసుపత్రి రూ.5 కోట్లతో మహిళా సమాఖ్య భవనం, ఆర్టీఓ బిల్డింగ్‌, రూ.12 కోట్లతో ఆర్టీసీ బస్టాండ్‌ వంటి అభివృద్ధి కార్య్రకమాలు జరుగుతున్నాయన్నా రు. రేవంత్‌ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. సంక్షేమం పేరిట గత ప్రభుత్వం 8.30 లక్షల కోట్ల అప్పు చేసిందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దామోదర్‌ రెడ్డి, కలెక్టర్‌ హేమంత్‌ పాటిల్‌, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ సునేంద్ర, మాజీ ఎంపీపీ సూర్య ప్రతాప్‌ గౌడ్‌, గ్రంథాలయ చైర్మెన్‌ రాజేందర్‌, రాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -