Thursday, July 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రిన్సిపాల్‌ నీచ బుద్ధి

ప్రిన్సిపాల్‌ నీచ బుద్ధి

- Advertisement -

విద్యార్థిపై లైంగికదాడికి యత్నం
కొల్లాపూర్ ప్రిన్సిపాల్ పై కఠిన చర్యలు తీసుకోవాలి
డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు శివవర్మ డిమాండ్‌
ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కాలేజీ ఎదుట ధర్నా, రోడ్డుపై రాస్తారోకో
​నవతెలంగాణ – కొల్లాపూర్‌

విద్యాబుద్ధులు నేర్పాల్సిన ప్రిన్సిపాల్‌ విద్యార్థి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, తన గదికి పిలిపించుకుని లైంగికదాడికి యత్నించడం దుర్మార్గమని, అతన్ని వెంటనే సస్పెండ్‌ చేయాలని డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్‌ చేశాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండల కేంద్రంలో ఉన్న పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని పీజీ కళాశాలలో మంగళవారం రాత్రి జరిగిన ఘటనపై విద్యార్థి, యువజన సంఘాల నాయకులు, విద్యార్థులు బుధవారం కళాశాల ఎదుట ధర్నా, రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.శివ వర్మ, జిల్లా కార్యదర్శి ఎన్‌ మధు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎం.తారా సింగ్‌, కళాశాల విద్యార్థి ఎం.ఆది మాట్లాడారు. పీజీ కళాశాల ప్రిన్సిపాల్‌ మంగళవారం రాత్రి 10 గంటలకు విద్యార్థిని తన గదికి పిలిపించుకొని లైంగికంగా వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్‌ను వెంటనే సస్పెండ్‌ చేసి, చట్టపరమైన చర్యలు తీసుకొని రిమాండ్‌ కు తరలించాలని డిమాండ్‌ చేశారు. విద్యాబుద్ధులు చెప్పాల్సిన వ్యక్తి విద్యార్థిపై దాడి చేయడం సిగ్గుచేటన్నారు. కాలేజీలో ప్రిన్సిపాల్‌ అరాచకాలకు ఎందరో విద్యార్థులు బలవుతున్నారని తెలిపారు. ధర్నా సమయంలో విద్యార్థి సంఘాల నేతలకు, పోలీసులకు కొంత సేపు వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ఎస్‌ఐ జోక్యం చేసుకొని యూనివర్సిటీ అధికారులతో మాట్లాడి వారిని ఇక్కడికి రప్పిస్తామన్నడంతో రాస్తారోకో విరమించారు. అనంతరం పాలమూరు యూనివర్సి టీ వీసీ ఓఎస్‌డి మధుసూదన్‌ రెడ్డి, యూనివర్సిటీ రిజిస్టర్‌ రమేష్‌ బాబు విద్యార్థుల వద్దకు వచ్చి మాట్లాడారు. ఇలాంటి ఘటనలు జరగడం చాలా దురదృష్టకరమని, చట్టపరమైన చర్యలు తీసుకుం టామని హామీ ఇచ్చారు. విద్యార్థికి అండగా ఉంటామని చెప్పారు. పీజీ కాలేజీ పరిధిలో ఉన్న సమస్యల్ని అత్యంత తొందర్లోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు శివశంకర్‌, పీజీ కళాశాల ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్ష కార్యదర్శులు విలాస్‌, శివ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు రామకృష్ణ, శివ, ఆవాజ్‌ జిల్లా కన్వీనర్‌ ఎండీ సలీం, పాలమూరు యూనివర్సిటీ అధ్యక్షులు రాజేష్‌, మత్స్యకార్మిక సంఘం జిల్లా కన్వీనర్‌ శంకర్‌, నాయకులు మల్లేష్‌, రాజు, మధు, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.
అసలేం జరిగిందంటే..
పాలమూరు వర్సిటీ పరిధిలోని కొల్లాపూర్‌ పీజీ కాలేజీలో ఓ విద్యార్థి ఉన్నత విద్యను పూర్తి చేసుకున్నాడు. అతనిపై ప్రిన్సిపాల్‌ కొంతకాలంగా అనుచితంగా ప్రవర్తిస్తున్నాడు. శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు. ఈ క్రమంలోనే టీసీ కోసం వచ్చిన అతన్ని మంగళవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో ప్రిన్సిపాల్‌ తన గదికి పిలిపించుకున్నాడు. అనంతరం విద్యార్థిపై లైంగిక దాడికి యత్నించాడు. చిత్రహింసలను భరించలేక ప్రిన్సిపాల్‌ ప్రయివేట్‌ భాగాల్లో కొరికేసి విద్యార్థి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. అనంతరం తోటి విద్యార్థులకు విషయం చెప్పాడు. వెంటనే విద్యార్థులంతా ప్రిన్సిపాల్‌ నివాసానికి చేరుకున్నా రు. ఒక్కసారిగా పెద్దఎత్తున విద్యార్థులు రావడంతో భయపడిపోయిన ప్రిన్సిపాల్‌ పారిపోయాడు. తోటి విద్యార్థుల సాయంతో బాధిత విద్యార్థి పోలీసులను ఆశ్రయించాడు. తనపై ప్రిన్సిపాల్‌ కొద్దిరోజులుగా చేస్తున్న శారీరక, మానసిక వేధింపులపై ఫిర్యాదు చేశాడు. ప్రిన్సిపాల్‌ రాక కోసం పీజీ విద్యార్థులు రాత్రంతా పడిగాపులు కాశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -