Thursday, July 30, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనేటి తరానికి 
అహల్యా రంగ్నేకర్ ఆదర్శం

నేటి తరానికి 
అహల్యా రంగ్నేకర్ ఆదర్శం

- Advertisement -

సీఐటీయూ కార్యాలయంలో ఘనంగా 104వ జయంతి వేడుకలు
​నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

‌నేటి తరానికి అహల్యా రంగ్నేకర్ జీవితం ఆదర్శనీయమని సీఐటీయూ రాష్ర్ట ఉపాధ్యక్ష‍ులు విఎస్‌.రావు అన్నారు. బుధవారం హైదరాబాద్‌‌లోని ఆ సంఘం రాష్ర్ట కార్యాలయంలో రంగ్నేకర్‌ 104‌వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పి. శ్రీకాంత్ అధ్యక్షతన జరిగన సభలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. ఈశ్వర్‌‌రావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విఎస్‌.రావు మాట్లాడుతూ కుల, మత వివక్షతకు వ్యతిరేకంగా రంగ్నేకర్‌ చివరి వరకు పోరాడారని కొనియాడారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే నాయకత్వంలోని సాంఘిక సంస్కరణ ఉద్యమానికి మద్దతిచ్చారని గుర్తు చేశారు. 1975లో ఎమర్జెన్సీని వ్యతిరేకించినందుకు ఇందిరాగాంధీ ప్రభుత్వం ఆమెను19 నెలలపాటు జైల్లో నిర్బంధించిందన్నారు. సీఐటీయూలో అనేక బాధ్యతలు నిర్వహిస్తూనే పేద ప్రజల కోసం పని చేశారని పేర్కొన్నారు. 1977లో పార్లమెంటు ఎంపిగా కూడా పనిచేశారని అన్నారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్ వందన సమర్పణ చేసిన ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు వై. సోమన్న, ఎ.సునీత, రొయ్యల రాజు, వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -