దశలవారీగా రోడ్డుపైకి
ఇవిలేనిచోట
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
నవతెలంగాణ- ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
టీజీఎస్ఆర్టీసీ ఎలక్ర్టిక్ బస్సులను ఆర్టీసీ నెమ్మదిగా రోడ్డుమీదకు తెస్తున్నది. ఇటీవల వరుస ప్రమాదాల నేపథ్యంలో జేబీఎం కంపెనీకి చెందిన బస్సులను రోడ్లపై నుంచి ఉపసంహరించిన విషయం తెలిసిందే. అయితే ఆ బస్సులకు దశలవారీగా పిట్నెస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. బస్సులో అమర్చిన బ్యాటరీలను క్షుణ్ణంగా పరిశీలించిన మీదట ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీచేస్తున్నట్టు ఆర్టీసీ ఉన్నాతాధికారులు చెప్పారు. హైదరాబాద్ బస్సుభవన్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ బృందం, జేబీఎం సాంకేతిక బృందంతోపాటు చైనా నుంచి వచ్చిన ప్రత్యేక బ్యాటరీ నిపుణులు సంయుక్తంగా ఈ బస్సులను తనిఖీ చేస్తున్నారు. వంద శాతం ఫిట్నెస్ సర్టిఫికెట్ ఆధారంగానే రోడ్లపైకి తెస్తున్నట్టు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. మొత్తం 500 జేబీఎం బస్సులకుగాను ఇప్పటికే 150 బస్సులు రోడ్లమీద తిరుగుతున్నాయి. బుధవారం 118 బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించి క్లియరెన్స్ ఇచ్చారు. మరో రెండు, మూడు రోజుల్లో మిగతా బస్సులను సైతం రవాణాకు అనుమతించే అవకాశలు కనిపిస్తున్నాయి. ఎలక్ర్టిక్ బస్సులు అందుబాటులోని రాని ప్రాంతాల్లో ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలియజేశారు.
జేబీఎం ఎలక్ట్రిక్ బస్సులకు ‘ఫిటినెస్’ పరీక్షలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



