Thursday, July 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఉద్యమ జర్నలిస్టులను ఆదుకోండి

ఉద్యమ జర్నలిస్టులను ఆదుకోండి

- Advertisement -

కేశవరావుకు టీజేఎఫ్‌ వినతి
నవతెలంగాణ-హైదరాబాద్‌

తెలంగాణ సాధన ఉద్యమంలో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పోరాడిన జర్నలిస్టులు, ఉద్యమకారులను ఆదుకోవాలని తెలంగాణ జర్నలిస్ట్స్‌ ‌ఫోరం రాష్ట్ర అధ్యక్ష‍ులు పల్లె రవికుమార్‌ ప్రభుత్వాన్నీ కోరారు. అర్హులైన ఉద్యమ జర్నలిస్టులందరికీ సంక్ష‍ేమ పథకాలు వర్తింపచేయాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం హైదరాబాద్‌‌లో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమ కమిటీ చైర్మెన్‌ కె. కేశవరావును కలిశారు. జర్నలిస్టులు, ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమంపై వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ మలిదశ ఉద్యమం కాలం నాటి క్షేత్రస్థాయి పరిస్థితులు, ఉద్యమకారులు, జర్నలిస్టులు పోషించిన పాత్ర, ప్రభుత్వం పరంగా చేపట్టాల్సిన సంక్షేమ కార్యక్రమాలను చైర్మెన్‌తో సుదీర్ఘంగా చర్చించారు. ఆ నాటి సంఘటన లు, జర్నలిస్టులు ఎదుర్కొన్న కష్టాలు,నష్టాలు వివరించారు. ఉద్యమంకాలంతోపాటు తెలంగాణ రాష్ట్రం వచ్చాక జర్నలిస్టుల పరిస్థితులను చైర్మెన్‌ ‌దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం ప్రధాన కార్యదర్శి మేకల క్రిష్ణ, ఉప ప్రధానకార్యదర్శి మహేశ్వరం మహేంద్ర చారి, కార్యదర్శి ముద్దం స్వామి, పాలకూరి రాజు, చంటి, కార్యవర్గ సభ్యుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -