Thursday, July 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమైనర్లకు వాహనాలిస్తే..ఏడాదిపాటు రిజిస్ర్టేషన్‌‌ రద్దు

మైనర్లకు వాహనాలిస్తే..ఏడాదిపాటు రిజిస్ర్టేషన్‌‌ రద్దు

- Advertisement -

లైసెన్స్‌ కోసం ఏడేండ్లు ఆగాల్సిందే
గత ఏడాదిలో 4070 
 మందిపై చర్యలు 


నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌ ‌
18 ఏండ్లలోపు వయస్సున్న పిల్లలు (మైనర్లు) వాహనాలు నడిపే విషయంలో రాష్ట్ర రవాణా శాఖ కఠినంగా వ్యవహరిస్తున్నది. ద్వీచక్ర వాహనం, ఇతర ఏదైనా వాహనం తీసుకుని రోడ్డు మీదకొస్తే ఇక అంతే. తనిఖీల్లో చట్టవిరుద్ధంగా వాహనం నడుపుతున్నారని తేలితే వాళ్లకు భవిష్యత్తులో లైసెన్స్‌ ‌జారీలో కష్టాలు తప్పవు. అలాగే ఆ సందర్భంగా నడుపుతున్న వాహనాన్ని సీజ్‌ ‌చేస్తారు. ఏకంగా రిజిస్ర్టేషన్‌‌నే రద్దు చేశారు. ఆ మైనర్‌‌ తన లైసెన్స్‌ ‌కోసం ఏడేండ్ల వరకు ఎదురు చూడాల్సిందే. ఈ మేరకు రవాణా శాఖ మోటారు వాహనాల చట్టం-1998లోని సెక్ష‍న్‌ 199-ఏను ఆయుధంగా వాడుకుంటున్నది. ఈ తరహా కేసులను గతేడాదిలో 4070 వరకు గుర్తించారు. వాహనాలను సీజ్‌ ‌చేసి రిజస్ర్టేషన్లను రద్దు చేశారు. అంతేగాకుండా మైనర్ల తల్లీదండ్రులు, సంరక్ష‍కులపై ‌కేసులు పెడుతున్నారు. హత్యాయత్నం కింద జైలుకు పంపే పరిస్థితి వస్తున్నది. పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దని ఇటు ప్రభుత్వం, అటు రవాణా శాఖ కోరుతున్నాయి. అలా చేస్తే చట్టపరంగా తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నాయి. మోటారు వాహనాల చట్టం ప్రకారం మైనర్లు వాహనం నడుపుతూ పట్టుబడితే ఆ వాహనం యాజమాని లేదా సంరక్ష‍డిని నేరస్తునిగా పరిగణిస్తారు. చట్టం నిర్దేశించిన మేరకు శిక్ష‍ార్వులవుతారు. సంఘటనకు కారణమైన వాహనం రిజస్ర్టేషన్‌ 12 నెలల పాటు రద్దు చేస్తారు. సంబంధిత ఘటనకు బాధ్యుడైన మైనర్‌‌కు 25 ఏండ్లు వచ్చేవరకు డ్రైవింగ్‌ ‌లైసెన్స్‌ ఇవ్వరు. ఈ నిబంధనలను రాష్ట్ర రవాణా శాఖ మరింత కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా తనిఖీ అధికారులకు ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలను బుధవారం జారీ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -