Sunday, March 8, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంనేపాల్‌ ప్రధాని పీఠానికి చేరువలో బాలేంద్ర షా

నేపాల్‌ ప్రధాని పీఠానికి చేరువలో బాలేంద్ర షా

- Advertisement -

ఖాట్మాండు: సుదీర్ఘ కాలంగా రాజకీయ అనిశ్చితిని ఎదుర్కొంటున్న నేపాల్‌లో సంప్రదాయ రాజకీయ నేతలకు కాలం చెల్లినట్లే కనిపిస్తోంది. జెన్‌-జీ తిరుగుబాటు అనంతర పరిణామాలు చూస్తుంటే అక్కడి రాజకీయ ముఖచిత్రం మారిపోతున్నట్టు తెలుస్తోంది. గత 18 ఏండ్లలో 14 ప్రభుత్వాలు మారిన ఈ హిమాలయ రాజ్యంలో.. త్వరలోనే ఓ యువనేత సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాజా సార్వత్రిక ఎన్నికల్లో సంప్రదాయ దిగ్గజాలను పక్కకునెట్టి అఖండ విజయం దిశగా దూసుకెళ్తున్నారు నేపాలీ యువ నేత బాలేంద్ర షా. 2022లో ఖాట్మాండు మేయర్‌ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి.. ప్రధాన పార్టీలు, కీలక నేతలను ఓడించి యావత్‌ దేశాన్ని ఆశ్చర్యపరిచారు. మేయర్‌గా దాదాపు మూడున్నరేండ్ల కాలంలోనే రాజధానిలో అనేక సంస్కరణలు చేపట్టారు. నాలుగు సార్లు ప్రధాని పదవి చేపట్టిన కేపీ శర్మ ఓలి నియోజకవర్గం ఝాపా-5 నుంచి పోటీ చేసిన బాలేంద్ర 49వేల మెజార్టీతో విజయం సాధించారు.దేశ పార్లమెంటులోని ప్రజా ప్రతినిధుల సభలో మొత్తం 275 స్థానాలుండగా వాటిలో 165 స్థానాలకు ప్రత్యక్ష ప్రాతిపదికన ఓటింగు జరిగింది. 110 స్థానాలకు దామాషా ప్రాతిపదికన ఎన్నిక నిర్వహించారు. ఇప్పటివరకు 78 స్థానాల్లో ఫలితం తేలగా 62 చోట్ల ఆర్‌ఎస్పీ విజయం సాధించింది. ఒక్క కాఠ్‌మాండూలోనే 10 నియోజకవర్గాలను కైవసం చేసుకుంది. దాదాపు 60 స్థానాల్లో ముందంజలో ఉన్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -