నీవు నా ప్రాణమని వాగ్దానం చేస్తే
నిజంగా ప్రాణ మైపోతామా
ఎవరో ఏదో చెప్పడమైతే చెపుతారు
మనం విని నవ్వుకోవాలి
కష్టంలో ఎవరిదగ్గరికైనా వెళ్లిచూడు
ఎంత దూరం పారిపోతారో
ఎవరేది చెప్పినా వినాలనిపిస్తే విను
అది నిజమనుకోకు, రాసి పెట్టుకోకు
సలీం జావెద్ సినిమాలైనా
మధుబాబు షాడో నవలలైనా
మనిషి గురించే చెపుతాయి
జీవించడం సర్కస్ లాంటిది
ప్లాట్ ఫారం మిత్రులక్కరలేదు
స్నేహమైనా, ప్రేమైనా
ప్రయాణం అంచుదాకా వుండాలి
గ్లామర్ పెంచే క్రికెట్ ఆట వేరు
మనిషి జాడ కోసం తపనపడే అన్వేషణవేరు రెండిటి ఆకర్షణ ఒకటి కాదు ఈత కోసం డైవ్ కొట్టిన వాడైనా
విరక్తితో దూకి మరణించిన వాడైనా
వెనకా ముందు ఒడ్డుకు చేరుతారు
ప్రవాహం, దేన్నికూడా, తనతో వుంచుకోదు కాలం మార్పుకోసం, నిరీక్షించొద్దు
మనం మారిపోయి, కాలంతో నడవాలి
అర్థంలేని ప్రశ్నలు వేసి విసిగించకండి
మనసులో నొప్పి,
ఇప్పుడిప్పుడే నిద్రపోతోంది
ఆశారాజు, 9392302245
జీవించడం సర్కస్ లాంటిది
- Advertisement -
- Advertisement -


