Monday, July 13, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుపోలీసుల నిర్లక్ష్యం.. హంతకుడిలో సైకోపాథిజం

పోలీసుల నిర్లక్ష్యం.. హంతకుడిలో సైకోపాథిజం

- Advertisement -

​దైవాలగూడ దారుణానికి కారణాలివే
సామూహిక హత్యలపై వివిధ వర్గాల్లో చర్చ
సీనియర్ ఐపీఎస్‌‌ల అంతర్మథనం


నవతెలంగాణ -ప్రత్యేక ప్రతినిధి

భారత్ ఫ్యూచర్ సిటీ కమిషనరేట్‌‌ షాబాద్ పోలీస్ స్టేషన్ ఏరియాలో గల దైవాలగూడ గ్రామంలో ఆరుగురి దారుణ హత్యలకు పోలీసుల నిర్లక్ష్యం, హంతకుడు రాజ్‌‌కుమార్‌‌లోని సైకోపాథిజమే కారణమనే చర్చ సమాజంలోని వివిధ వర్గాలలో సాగుతున్నది. అదే సమయంలో ఇలాంటి సమస్య ఏర్పడడానికి గల కారణాలు, ఎలాంటి పరిష్కార మార్గాలను అన్వేషించాలనే అంతర్మథనం సీనియర్ ఐపీఎస్ అధికారులలో జరుగుతున్నది. రాష్ట్రం ఉలిక్కి పడే తీరులో రాజ్‌‌కుమార్‌ ఏకంగా ఆరుగురిని అత్యంత కిరాతకంగా శుక్రవారం రాత్రి సామూహిక ఊచకోతకు పాల్పడ్డాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రమే గాక యావత్ భారత దృష్టి ని ఆకర్షించింది. ముఖ్యంగా దైవాలగూడ గ్రామ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. మరోవైపు పోలీస్ అధికారులే గాక సామాజిక, మానసిక శాస్త్రవేత్తలలో ఈ ఘోర ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. మే 16న తన గ్రామానికి చెందిన ఇంటర్ చదుతున్న మైనర్‌‌పై రాజ్‌‌కుమార్‌ లైంగికదాడికి పాల్పడ్డాడని షాబాద్ పోలీస్ స్టేషన్‌‌లో పోక్సో కేసు నమోదైంది. దీంతో 26న నిందితుడిని అరెస్టు చేసి పోలీసులు జైలుకు పంపించారు. కాగా బెయిల్‌‌పై బయటకు వచ్చిన రాజ్‌‌కుమార్‌.. శుక్రవారం(జులై 10‌న) రాత్రి మొదట తనపై కేసు పెట్టిన బాలిక ఇంటికెళ్లి ఆమె తల్లి, నానమ్మ లను కిరాతకంగా గొంతు కోసి చంపారు. ఆ తర్వాత బాలికను లాక్కెల్లి చెరువు గట్టు సమీపంలో హత్య చేశాడు. అక్కడి నుంచి నేరుగా తన ఇంటికి వచ్చిన రాజ్‌‌కుమార్‌.. తన భార్య, ఇద్దరు పిల్లలను కూడా అత్యంత దారుణంగా చంపి పారిపోవడం ఆ గ్రామంలో తీవ్ర కలకలం రేపింది.

ఒకేసారి ఇంతటి ఘోర అకృత్యం జరగడానికి స్థానిక పోలీసుల నిర్లక్ష్యమే కారణమంటూ గ్రామస్థులు రహదారిపై బైటాయించి ఆందోళన చేసే పరిస్థితి ఏర్పడింది. రాజ్‌‌కుమార్‌ వంటి అత్యంత క్రూరమైన స్వభావం కలిగిన రాక్షసుడిపై పోలీసులు… బెయిల్‌‌పై విడుదలై‌న తర్వాత ఆయనపై కన్నేసి ఉంచకపోవడం ఈ ఘోర కలికి దారి తీసిందనే ఆరోపణలు ప్రజల నుంచి వెల్లువెత్తాయి. ముఖ్యంగా మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలను సేవించి విచ్చలవిడిగా తిరుగుతూ మైనర్‌‌పై లైంగికదాడికి పాల్పడి జైలుకు వచ్చిన ఈ నేరస్తుడికి సైకాలజిస్ట్ తో జైల్ అధికారులు కౌన్సిలింగ్ చేయించి అతని మానసిక పరిస్థితి ని ముందుగానే అంచనా వేసి ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదని మానసిక శాస్త్రవేత్తలు అభిప్రాయ పడుతున్నారు. ముఖ్యంగా గంజాయి వంటి మత్తు పదార్థాలను సేవించే వారు సైకోపాథిజానికి గురవుతారని వారు అంటున్నారు. గంజాయి సేవించిన వారు తమను ఎవరు ఎదిరించినా, తమ పనులకు ఎవరు అడ్డుపడినా, తమను ఎవరు తీవ్రంగా అవమానించినా వారిని భౌతికంగా రూపుమాపాలనే తీవ్రమైన ఉన్మాద స్థాయికి వారి మానసిక స్థితి చేరుకుంటుందనీ, దానినే సైకోపాథిజం అంటారనే నిపుణులు తెలిపారు. ఇదే పరిస్థితికి చేరుకున్న రాజ్‌‌కుమార్‌ ఏ మాత్రం దయ, జాలి లేకుండా ఆరుగురిని మట్టుపెట్టారని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఊహించని రీతిలో ఒకే గ్రామంలో ఆరుగురు దారుణ హత్యకు గురి కావడం పట్ల రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ మొదలుకుని ఇతర సీనియర్ ఐపీఎస్ అధికారుల వరకు నిశితంగా దృష్టి ని సారించారు. ఇటీవలనే సీవీ ఆనంద్ సైతం తమ ఏరియాలలో తీవ్ర ఘటనలు జరిగినపుడు కేవలం కింది స్థాయి పోలీస్ అధికారులపై వదిలివేయకుండా సీనియర్ అధికారుల కూడా రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కానీ దైవాలగూడ గ్రామంలో నరరూప రాక్షసుడు రాజ్‌కుమార్‌‌ను నివారించడంలో పోలీసులు కూడా నిర్లక్ష్యం వహించారని సమాజంలోని అని వర్గాల నుంచి వస్తున విమర్శలు పోలీస్ ఉన్నతాధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా తగిన విధంగా స్పందించ లేదనే ఆరోపణలు విపక్షాల నుంచి వస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -