Monday, July 13, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనీటి బిందెలతో నిరసన

నీటి బిందెలతో నిరసన

- Advertisement -

నవతెలంగాణ-వేమనపల్లి
మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం సంపుటం గ్రామస్తులు నీటి సమస్య తీర్చాలని కోరుతూ ఖాళీ బిందెలతో ఆదివారం నిరసన తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించాలంటూ నినదించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. గ్రామంలో కొన్నిరోజులుగా తీవ్రమైన నీటి కొరత నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో దూర ప్రాంతాల నుంచి నీటిని తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు. ఈ సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా నీటి కొరతను తీర్చి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలంటూ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -