Monday, July 13, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవట్టిపల్లి కేజీబీవీ
 విద్యార్థుల రాస్తారోకో

వట్టిపల్లి కేజీబీవీ
 విద్యార్థుల రాస్తారోకో

- Advertisement -

సీఐ హామీతో విరమణ
నవతెలంగాణ-జోగిపేట

తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వట్టిపల్లి కేజీబీవీ విద్యార్థులు ఆదివారం రాస్తారోకో చేపట్టారు. సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం కేంద్రంలోని ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. రెండేండ్లుగా పాఠశాలలో ఎన్నో సమస్యలతో విద్యాభ్యాసం చేస్తున్నట్టు చెప్పారు. వట్టిపల్లి కేజీబీవీ పాఠశాలకు సొంత భవనం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. కాగా, విద్యార్ధుల రాస్తారోకోతో రహదారి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. దాంతో సీఐ అనిల్ కుమార్ అక్కడికి చేరుకొని విద్యార్థులను సముదాయించి ధర్నా విరమింపజేశారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -