నవతెలంగాణ-మద్నూర్
జూన్ 25న ప్రారంభమైన ఎస్ఐఆర్ ప్రక్రియ ఈనెల 24తో ముగియనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియ వేగంగా తప్పులు లేకుండా పూర్తయ్యేందుకు తాజాగా అధికారులు తడి హిప్పర్గాలో ఎస్ఐఆర్ హెల్ప్ లైన్ కౌంటర్ లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తహశీల్దార్ ఎండీ ముజీబ్ మాట్లాడుతూ.. ఈ కౌంటర్ల ద్వారా 2002 జనాభా లెక్కల ప్రకారం మరణించిన వారి ఓట్లు కాకుండా ప్రస్తుతం జీవించిఉన్న ఏ ఒక్కరి ఓటు గల్లంతు కాకుండా పారదర్శకంగా ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. అంతేకాదు ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఎవరికైనా, ఎలాంటి సందేహాలున్నా.. ఈ హెల్ప్ లైన్ ఎంతో ఉపయోగపడుతుందని వారు స్పష్టం చేశారు. అనంతరం సర్పంచ్ అశ్విని సుదర్శన్ మున్నా మాట్లాడుతూ.. మండల పరిధిలో ఎస్ఐఆర్ ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు తహశీల్దార్ ఎంతో కృషి చేస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్. గ్రామ పెద్దలు, దత్తు పటేల్, తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది, బీఎల్ ఓలు తదితరులు పాల్గొన్నారు.
ఎస్ఐఆర్ హెల్ప్ లైన్ కౌంటర్ ఏర్పాట్ల పట్ల సర్పంచ్ హర్షం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



