మండల వైద్యాధికారి వినయ్ భాస్కర్
నవతెలంగాణ – మల్హర్ రావు
అంతర్జాతీయ నులిపురుగుల నివారణోత్సవ కార్యక్రమంలో భాగంగా సోమవారం మండలంలో 98 శాతం పూర్తియినట్లుగా తాడిచెర్ల ప్రభుత్వ ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి వినయ్ భాస్కర్ తెలిపారు. మిగతా 2 శాతం వారికి తిరిగి వైద్య సిబ్బంది వేస్తారని చెప్పారు.1-19 సంవత్సరాల పిల్లలకు ఆల్బజండాల్ టాబ్లెట్స్ ఇవ్వడం జరిగిందని మండలంలో మొత్తం 3,341 పిల్లలకు గాను 3,286 పిల్లలకు టాబ్లెట్స్ అంగన్వాడిలు,ప్రభుత్వ,ప్రయివేటు పాఠశాలల్లో వేశారు.మిగిలిన 55 మంది పిల్లలకు 26 జూలై మాఫ్ అఫ్ డే రోజున టాబ్లెట్స్ వేయున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు,తాడిచెర్ల సర్పంచ్ బండి స్వామి,ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.
మల్హర్ లో నులిపురుగుల పంపిణీ 98 శాతం పూర్తి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



