- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మంథని నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులకు రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు ఎల్ఓసి పత్రాలు ఇప్పిస్తూ అండగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో మంథని నియోజకవర్గం మహా ముత్తారం మండలంలోని సింగారం గ్రామానికి చెందిన కోట విక్కి హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో అనారోగ్యంతో బాధపడుతున్న క్రమంలో మంత్రి దృష్టికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి రూ.1.20 లక్షల ఎల్ఓసి మంజూరు చేసి ఇప్పించారు. అండగా నిలిచినా మంత్రి శ్రీధర్ బాబుకు విక్కీకుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
- Advertisement -



