- Advertisement -
నవతెలంగాణ-బాల్కొండ
నాగారంలోని రాజారామ్ స్టేడియంలో జిల్లా అథ్లెటిక్స్ ఆధ్వర్యంలో జరిగిన 100 మీటర్ల పరుగు పందెంలో బాల్కొండ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో సిఇసి సెకండియర్ చదువుతున్న విద్యార్థిని శివాని తృతీయ స్థానం సాధించిందని ప్రత్యేక అధికారిని గరిగే భవాని తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం పాఠశాలలో ఉపాధ్యాయ బృందం శివానిని అభినందించారు.
- Advertisement -



