Tuesday, July 14, 2026
E-PAPER
Homeసినిమాఅందరికీ కనెక్ట్ అయ్యే ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్

అందరికీ కనెక్ట్ అయ్యే ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్

- Advertisement -

రుత్విక్, విశాఖ ధిమాన్ జంటగా నటించిన సినిమా ‘రాజా ది రాజా’. అనిల్ బోయిడపు దర్శకత్వంలో బృందావన్ క్రియేషన్స్ బ్యానర్‌పై కె. నిహారిక దాసరి నిర్మించారు.
కె. శ్రీలత రెడ్డి సమర్పిస్తున్నారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమా ఈనెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత కె. నిహారిక దాసరి మీడియాతో ముచ్చటించారు.
మా అబ్బాయి రుత్విక్‌కు సినిమా లంటే చాలా ప్యాషన్. అమెరికాలో ఫిల్మ్ కోర్స్ చేశాడు. తరువాత ఒక షార్ట్ ఫిల్మ్‌లో అబ్బాయి, అమ్మాయి రెండు రకాల పాత్రలు చేశాడు. ఆ షార్ట్ ఫిల్మ్ చూసిన తర్వాత తనపై నాకు మరింత నమ్మకం పెరిగింది. ఆ షార్ట్ ఫిల్మ్ చూసి తన కోసం కొన్ని కథలు కూడా వచ్చాయి. కానీ ఒక మంచి ఛాలెంజింగ్ పాత్రతో హీరోగా పరిచయం చేయాలను కున్నాం. అలా ఈ సినిమా చేశాం. ఇది చాలా బలమైన కథ. ఇందులో హీరో రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తాడు. ఏ నటుడికైనా ఇది పెద్ద ఛాలెంజ్. రుత్విక్ ఆ రిస్క్ తీసుకుని ఈ సినిమా చేశాడు. కథ పరంగా కూడా మేము చాలా కాన్ఫి డెంట్‌గా ఉన్నాం. ఇలాంటి మంచి ప్రయ త్నాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని నమ్ము తున్నాం. ఫైనల్ అవుట్‌పుట్ చూసిన తర్వాత మేము అనుకున్న దానికంటే బాగా వచ్చిందనే సంతృప్తి కలిగింది.
ట్రైలర్ చూసిన తర్వాత ‘మగధీర` వంటి గొప్ప సినిమాతో పోల్చడం ఆనందంగా అనిపించింది. అయితే రెండు కథలకు ఎలాంటి సంబంధం లేదు. సినిమా చూసిన తర్వాత అసలు ట్విస్ట్ మీకే తెలుస్తుంది.
మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ మాకు వంద శాతం సపోర్ట్ చేస్తున్నారు. వారికి మా సినిమా నచ్చి, సినిమాను విడుదల చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాను.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -