Tuesday, September 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో నీటి కుళాయి ఏర్పాటు

ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో నీటి కుళాయి ఏర్పాటు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండల కేంద్రంలోని ప్రభుత్వ 30 పడకల ఆస్పత్రి ఆవరణలో రోగుల అవసరాల దృష్ట్యా జుక్కల్ గ్రామపంచాయతీ సర్పంచ్ సావిత్ర సాయ గౌడ్ ఆదేశాల మేరకు గురువారం కుళాయి ఏర్పాటు చేశారు. ఈ ఆస్పత్రికి జుక్కల్ మండల పరిధిలోని అనారోగ్య బాధితులతో పాటు పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల వారు కూడా వస్తుంటారు. అయితే నీటి సౌకర్యం లేక ఆస్పత్రి వెనుక ఉన్న ఎల్లమ్మ ఆలయం నుంచి తీసుకొచ్చుకునే పరిస్థితి ఉండేది. దీంతో గత కొన్ని రోజులుగా ఈ పరిస్థితిని గమనిస్తున్న జుక్కల్ సర్పంచ్ మానవతా దృక్పథంతో ఆస్పత్రి ఆవరణలోనే నీటి కుళాయిని ఏర్పాటు చేయించారు. ఈ క్రమంలో ఆస్పత్రి సిబ్బందితో పాటు రోగులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -