Thursday, July 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ ఎల్ నినో వాతావరణ పరిస్థితులపై రైతులకు అవగాహన

 ఎల్ నినో వాతావరణ పరిస్థితులపై రైతులకు అవగాహన

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
మండల పరిధిలోని సుల్తాన్ పేట్, శాఖాపూర్ గ్రామాల శివారు పంటలను మండల వ్యవసాయ అధికారి రాజు గురువారం పరిశీలించారు. ఈ క్రమంలో ఎల్ నినో వాతావరణ పరిస్థితులపై స్తానిక రైతాంగానికి ఆయన అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్ నినో ప్రభావంతో పంటలకు సరిపడా వర్షాలు పడవని చెప్పారు. పంటలకు బదులుగా ఆరుతడి పంటల సాగు చేయడం మేలని సూచించారు. పెసర, మినుము, నువ్వులు, సజ్జలు, కూరగాయలు వంటివి సాగు చేస్తే ఆశాజనక లాభాలు ఉంటాయని చెప్పారు. వరి సాగుచేసే రైతులు వర్షభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సాగు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సుల్తాన్పేట్ గ్రామ సర్పంచ్ రాజేశ్వర్ గౌడ్, ఉప సర్పంచ్, శేఖపూర్ ఉప సర్పంచ్, ఏఈవో లు విశాల్ , రాజహిత గ్రామ రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -