Thursday, July 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దమ్ముంటే చర్చకు రావాలి 

దమ్ముంటే చర్చకు రావాలి 

- Advertisement -

-బీఆర్ఎస్ శ్రేణులకు కాంగ్రెస్ శ్రేణుల సవాల్
-ఇథనాల్ పరిశ్రమలకు ఎన్ఓసీలిచ్చింది బీఆర్ఎస్
-ప్రజారోగ్యంపై మా చిత్తశుద్ది మాకుందని హితవు
నవతెలంగాణ-బెజ్జంకి

పదేండ్ల అధికారంలో మండలంలో బీఆర్ఎస్ శ్రేణులు వ్యవహరించిన తీరు ప్రజలకు తెలుసునని.. ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతున్న ఇథనాల్ పరిశ్రమలకు బీఆర్ఎస్ సర్పంచులు ఎన్ఓసీలు ఇచ్చి..ఇప్పుడూ ప్రజారోగ్యమంటూ ఆరోపణలు చేస్తున్న వైనంపై చర్చకు సిద్దమని..దుమ్ముంటే చర్చకు రావాలని బీఆర్ఎస్ శ్రేణులకు కాంగ్రెస్ శ్రేణులు సవాల్ చేశారు.గురువారం మండల కేంద్రంలోని సత్యార్జునా గార్డెన్ యందు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ శ్రేణులు చేసిన సవాలును కాంగ్రెస్ శ్రేణులు స్వీకరిస్తున్నామని ప్రకటించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు కొంకటి రాములు మాట్లాడారు.

బీఆర్ఎస్ పరిపాలనలో గుగ్గీళ్ల,పోతారం గ్రామ సర్పంచులు ఇథనాల్ పరిశ్రమల నిర్మాణానికి అడ్డంకుల్లేకుండా ఎన్ఓసీలిచ్చింది నిజం కాదా?మండల పరిధిలోని దాచారం గ్రామ శివారులోని సర్వే నంబర్ 124 యందు అసలైన పట్టాదారులకు అన్యాయం చేసి సుమారు 14 ఎకరాలకు అక్రమంగా పరిహారం తీసుకున్నది వాస్తవం కాదా?మండల కేంద్రంలోని 440 సర్వే నంబర్ యందు ప్రభుత్వ భూమిని అక్రమంగా పట్టాలు చేసుకున్న ఘన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది కాదా? బీఆర్ఎస్ శ్రేణులను ప్రశ్నించారు.రాబోయే రోజుల్లో అక్రమంగా తీసుకున్న పరిహారం..ప్రభుత్వ భూమిని పట్టాలుగా మార్చుకున్న వైనంపై ప్రజలకు అధారాలతో బట్టభయలు చేస్తామని హెచ్చరించారు. ప్రజారోగ్యంపై మా చిత్తశుద్ధి మాకుందని హితవు పలికారు.బీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు మీ ఆస్తులేంతా?పదేళ్ల అధికారంలో పోగేసినా ఆస్తులేంతా?అనే అంశంపై ప్రజాక్షేత్రంలో చర్చకు సిద్దమవ్వాలని బీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. మాజీ సర్పంచ్ రావుల నర్సయ్య,జిల్లా కార్యదర్శి అక్కరవేణి పోచయ్య,ఉప సర్పంచ్ మచ్చ కుమార్, ఎలిగే సతీష్,బండి వేణు,నారాయణ రెడ్డి,జంగిలి తిరుపతి,సంపత్,అమరాజు నవీన్,కర్రావుల సందీప్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -