Friday, July 17, 2026
E-PAPER
Homeజాతీయంఫిడెల్ కాస్ట్రో రూజ్ 
శతజయంతి ఉత్సవాలకు రండి

ఫిడెల్ కాస్ట్రో రూజ్ 
శతజయంతి ఉత్సవాలకు రండి

- Advertisement -

సీపీఐ(ఎం) నేతలను ఆహ్వానించిన క్యూబా
రాయబారి జువాన్‌ కార్లోస్‌ మార్సాన్‌ అగ్యులేరా

న్యూఢిల్లీ : హవాలో జరగనున్న ఫిడెల్ కాస్ట్రో రూజ్ శతజయంతి ఉత్సవాలకు హాజరుకావాలని క్యూబా రాయబారి జువాన్ కార్లోస్ మార్సాన్ అగ్యులేరా సీపీఐ(ఎం) నేతలను ఆహ్వానించారు. గురువారం న్యూఢిల్లీలోని సీపీఐ(ఎం) ప్రధాన కార్యాలయం ఏకే గోపాలన్ భవన్‌లో వారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఏ. బేబీ , పొలిట్ బ్యూరో సభ్యులు, అంతర్జాతీయ విభాగం అధిపతి ఆర్. అరుణ్ కుమార్, రాయబారి జువాన్ కార్లోస్ మార్సాన్ అగ్యులేరాకు స్వాగతం పలికారు. క్యూబా కమ్యూనిస్ట్ పార్టీకి , క్యూబా ప్రజలకు సీపీఐ(ఎం)నేతలు సంఘీభావం తెలిపారు. అనంతరం ఇరువురు భేటీ అయ్యారు. ఆగస్టు 13న ఫిడెల్ కాస్ట్రో శతజయంతిని పురస్కరించుకుని భారతదేశంలో చేపట్టే కార్యక్రమాలపై చర్చించారు. పెరుగుతున్న సామ్రాజ్యవాద బెదిరింపులు , అమెరికా విధించిన కొనసాగుతున్న జాతి నిర్మూలన దిగ్బంధనం కారణంగా క్యూబా ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితులపై ప్రస్తావించారు. ఈ సందర్భంగా క్యూబా రాయబారి మాట్లాడుతూ తాము నిర్వహించనున్న కార్యక్రమాలు భారతదేశం , క్యూబా ప్రజల మధ్య దీర్ఘకాలంగా ఉన్న స్నేహ, సంఘీభావ బంధాలను మరింత బలోపేతం చేస్తాయని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -