సంఘీభావంగా 20న దేశవ్యాప్తంగా నిరసనలు
న్యూఢిల్లీ : నీట్ పేపర్ లీకేజీ విషయమై కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణించడంపై సిపిఎం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు పొలిట్‌బ్యూరో ఒక ప్రకటన విడుదల చేసింది. ఆందోళన, నిరసన చేస్తున్న నాయకులు, విద్యార్ధులతో మాట్లాడేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం తిరస్కరించడం చూస్తుంటే ఆ ప్రభుత్వ నిరంకుశ స్వభావం, ఏ మాత్రం సున్నితత్వం లేకపోవడం వెల్లడవుతోందని పొలిట్‌బ్యూరో పేర్కొంది. ఎలాంటి లీకేజీలకు తావులేకుండా పరీక్షలు నిర్వహించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం కావడానికి మూలాలు జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ). 2020లో వున్నాయని ఆ ప్రకటన పేర్కొంది. జాతీయ విద్యా విధానం ప్రోత్సహిస్తున్న ఈ విద్యా వ్యవస్థ కేంద్రీకరణ, వ్యాపారీకరణల కారణంగా కోచింగ్ సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకురావడానికి దారి తీస్తున్నాయని పేర్కొంది. మతపరమైన రంగు పులమడంతో పాటూ అన్ని రకాల అవకతవకలకు ఈ పేపర్ లీకేజీనే మూల కారణమని పొలిట్‌బ్యూరో విమర్శించింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ఎన్టీఏ ను, ఎన్ఈపీ-2020ని రద్దుచేయాలన్న డిమాండ్‌ను సీపీఐ(ఎం) పునరుద్ఘాటించింది. సోనమ్ వాంగ్‌చుక్, నిరసన తెలుపుతున్న ఇతర విద్యార్ధులకు సంఘీభావంగా నిలవాల్సిందిగా అన్ని శాఖలకు, సంబంధిత రంగాల ప్రముఖులకు పొలిట్‌బ్యూరో పిలుపిచ్చింది. ఈ డిమాండ్ల సాధనకు, సోనమ్ వాంగ్చుక్కు సంఘీభావంగా జులై 20న దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాల్సిందిగా పిలుపిచ్చింది.
సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యంపై సీపీఐ(ఎం) ఆందోళన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



