Saturday, July 18, 2026
E-PAPER
Homeరాష్ట్రీయందేవాదాయ శాఖలో 191 మంది నియామక పత్రాలు

దేవాదాయ శాఖలో 191 మంది నియామక పత్రాలు

- Advertisement -

మంత్రి కొండా సురేఖ అందజేత
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

దేవాలయం అనేది భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, వైదిక విజ్ఞానానికి, ధర్మ పరిరక్షణకు కేంద్రంగా నిలిచే పవిత్ర క్షేత్రమని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గుర్తు చేశారు. అలాంటి దేవాలయాల వైభవాన్ని పరిరక్షించే బాధ్యతను నిర్వర్తించే అర్చకులు, వేదపండితులు, పరిచారకులు, వాయిద్య కళాకారులు, దేవాలయ వంట సిబ్బంది సేవలు అత్యంత పవిత్రమైనవని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో నిర్వహించిన 191 మందికి నూతన ఉద్యోగులకు నియామక పత్రాలను మంత్రి అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 47 ఆలయాలకు ఎంపికైన అర్చకులు, వేదపండితులు, పరిచారకులు, మృదంగం, డోలు, సన్నాయి, శృతి, తాళం తదితర విభాగాలకు చెందిన ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. 191 మంది ఉద్యోగుల నియామకం చేపట్టడం తెలంగాణ దేవాదాయ శాఖ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘట్టమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి, భక్తులకు నాణ్యమైన సేవలు అందించేందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -