నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నీట్-2026 ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో శ్రీచైతన్య విద్యాసంస్థ అగ్రస్థానంలో నిలిచింది. శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మ మాట్లాడుతూ నీట్ ఫలితాల్లో తమ సంస్థ ఆధిపత్యాన్ని కొనసాగించిందని చెప్పారు. ఆలిండియా ఓపెన్ కేటగిరీలో మొదటి ర్యాంకు శ్రీచైతన్య విద్యార్థి ఆర్యన్ గుప్తా, మూడో ర్యాంకు ఉప్‌లక్ష్య గోయల్, తొమ్మిదో ర్యాంకు గౌరవ్ సింగ్‌తోపాటు ఆలిండియా ఐదో ర్యాంకు బూర సాయిశరణ్, ఆరో ర్యాంకు కె హనీశ్ సాధించారని వివరించారు. ఆలిండియా ఓపెన్ కేటగిరీలో పదిలోపు మూడు ర్యాంకులు, 20లోపు ఆరు ర్యాంకులు, 50లోపు 12 ర్యాంకులు, వందలోపు 18 ర్యాంకులు, వెయ్యిలోపు 84 ర్యాంకులు, కేటగిరీ ర్యాంకుల్లో పదిలోపు ఎనిమిది ర్యాంకులు, వందలోపు 67 ర్యాంకులు శ్రీచైతన్య విద్యార్థులే సాధించారని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన శిక్షణను అందిస్తున్నామనీ, అనితరసాధ్యమైన ప్రోగ్రామ్‌లు, మైక్రోషెడ్యూల్స్, అంతర్గత పరీక్షలు, ర్యాంకుల విధానం, దేశంలోనే ఉత్తమమైన సిబ్బంది కారణంగానే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని అన్నారు. నీట్-2027 నుంచి ఆన్‌లైన్ విధానంతోపాటు ఏఐ టెక్నాలజీతో కూడిన శిక్షణను విద్యార్థులకు అందిస్తామని చెప్పారు. నీట్ రెడీ ల్యాప్‌టాప్, సమగ్ర ఎకోసిస్టమ్‌ను బెంగుళూరులో ఆవిష్కరించామన్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ వినూత్న ల్యాప్‌టాప్ విధానాన్ని రూపొందించామని వివరించారు. రాంకులు పొందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ సీమ తదితరులు పాల్గొన్నారు.
నీట్ ఫలితాల్లో శ్రీచైతన్య అగ్రస్థానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



