- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: భారీ వర్షాల కారణంగా దక్షిణ ఇథియోపియాలోని గామో జోన్‌లో కొండచరియలు విరిగి పడ్డాయి. గచో బాబా, కంబా, బోంకే జిల్లాల్లో జరిగిన ఈ ఘటనలో 50 మంది ప్రాణాలు కోల్పోగా, 125 మంది గల్లంతయ్యారు. కొండచరియల బురద ఇళ్లపై పడటంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరుగే అవకాశముందని విపత్తు నిర్వాహణ అధికారులు తెలిపారు.
- Advertisement -



