- Advertisement -
– మామిళ్లపల్లి చెరువులో గాలింపు చర్యలు ముమ్మరం.. పోలీసులు, ఫైర్ సిబ్బంది రంగంలోకి
నవతెలంగాణ – ఉప్పునుంతల : నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం మామిళ్లపల్లి గ్రామానికి చెందిన ఆవుల తిరుపతయ్య (55) శనివారం మధ్యాహ్నం గ్రామ చెరువులో చేపల వేటకు వెళ్లి గల్లంతయ్యాడు. తిరుపతయ్య ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. భార్య చంద్రమ్మ ఫిర్యాదు మేరకు ఉప్పునుంతల ఎస్సై పుట్ట మహేష్ గౌడ్, ఫైర్ ఎస్సై శంకర్ గౌడ్, గ్రామ సర్పంచ్ మోహన్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. తిరుపతయ్య ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతుండగా, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



