మనం వేసే అడుగు గమ్యం వైపు
ప్రతి అడుగులోను కష్టం సుఖం
జీవితం పూల బాట కాదని తెలుసు
అయిన ఆగని పయనం
అనుకోకుండా వచ్చే విజయాలు ఉంటాయి
ఊహించని భాదలు ఉంటాయి
ప్రతి ఒక్కరి జీవితంలో బాధలు
బాదరా బంధీలు భాద్యతలు నిత్యం
అలుపెరుగని బాటసారిలా సాగే పయనం
నీ గమ్యం ఎటు అన్నప్పుడు
దిక్కు తోచని సంధిగ్ధం
అయినా ఓడిపోని అడుగులు
సాగిపో నీ గమ్యం అని
మనసు చేసే హెచ్చరికలు
సంక్షోభం లోను సమయ స్ఫూర్తి
ఆలోచనలు అందలం ఎక్కితే
అడుగులు మాత్రం ముందుకు సాగని వైనం
భాధ పడుతూ కూర్చోకు
పడుతూ లేస్తూ అయినా గమ్యం చేరుకో అన్నా
అడుగులు పడే వరకు తెలియదు తనకు
అద్భుత మైన శక్తి ఉందని
అడుగు అడుగులో ఆశవాహ దక్పథం
నా అడుగులు విజయానికి దగ్గరలో ఉన్నాయని
మనసు సర్ది చెపుతుంటే
మనకు తోడుగా ఉన్నది భాధల
లోను సంతోషం లోను మనసే
కదా ఒకో సారి అనిపిస్తుంది
నేను గమ్యం తెలియని బాటసారినెమో అని
కానీ మనసు చెబుతుంది
నీవె ప్పుడు మరొకరికి
గమ్యం చూపించే మార్గ దర్శివని
సుధారాణి కష్ణంరాజు, 7416592715
గమ్యం తెలియని బాటసారి
- Advertisement -
- Advertisement -



