Sunday, July 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరవాణా శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ మరింత కట్టుదిట్టం

రవాణా శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ మరింత కట్టుదిట్టం

- Advertisement -

నిబంధనలు పాటించని వాహనాల సీజ్‌
మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరిక
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యకలాపాలను మరింత కట్టుదిట్టం చేస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అధికారులను ఆదేశించారు. నిబంధనలను ఉల్లంఘిస్తున్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శనివారం హైదరాబాద్‌‌లోని రవాణా కమిషనర్ కార్యాలయంలో రవాణా శాఖ అధికారులతో జరిగిన సమీక్షలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఓవర్‌లోడింగ్ చేస్తున్న వాహనాలు, త్రైమాసిక పన్నులు చెల్లించని వాహనాలు, ఫిట్‌నెస్ లేని వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించి రాష్ట్రవ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టాలని సూచించారు. నిబంధనలను ఉల్లంఘిస్తున్న వాహనాలను అవసరమైతే సీజ్ చేయాలని ఆదేశించారు. చెక్‌పోస్టులు రద్దు చేసిన సమయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను మరింత బలోపేతం చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిందని గుర్తు చేశారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సిబ్బందిని మరింత సమర్థవంతంగా వినియోగించి తనిఖీలను పెంచాలని సూచించారు. జూన్ ఎనిమిది నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేసిన మొబైల్ స్క్వాడ్ల పని తీరును సమీక్షించారు. త్రైమాసిక పన్నులు చెల్లించని వాహన యజమానులపై భారీ జరిమానాలు విధించడంతో పాటు వాహనాలను సీజ్ చేయాలని చెప్పారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని స్లీపర్ బస్సుల్లో నిబంధనలను కఠినంగా అమలుచేయాలని స్పష్టం చేశారు. సమీక్షా సమావేశంలో స్పెషల్ సీఎస్‌ ‌వికాస్‌‌రాజ్‌, రవాణా శాఖ కమిషనర్ ఇలంబరితి, అదనపు జేటీసీ రమేష్, జేటీసీలు మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్, శివ లింగయ్య, డీటీసీలు రవీందర్ కుమార్, వెంకటరమణ, సురేష్ రెడ్డి , ప్రమీల, వాణి, సదానందం, ఆఫ్రిన్ ఓఎస్డి సైదులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -