- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : యాక్టివిస్ట్ సోనమ్ వాంగ్‌చుక్ భార్య గీతాంజలి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తుండటంతో ప్రయివేటు ఆస్పత్రికి తరలించాలని, దీనిపై కోర్టు అత్యవసర విచారణ చేపట్టాలని కోరారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో తమ కదలికలను నియంత్రిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఇది చట్ట విరుద్ధమైన నిర్బంధం అని మండిపడ్డారు. కాగా నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్‌ను పోలీసులు సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే.
- Advertisement -



