Tuesday, July 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రేషన్ కార్డు సభ్యులందరూ ఈ కేవైసీ చేయించుకోవాలి

రేషన్ కార్డు సభ్యులందరూ ఈ కేవైసీ చేయించుకోవాలి

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
మండల పరిధిలోని రేషన్ కార్డు సభ్యులందరూ ఈ కేవైసీ చేయించుకోవాలని స్తానిక రేషన్ డీలర్ పవన్ కంబ్లే వాట్సాప్ ద్వారా వినియోగదారులకు తెలిపారు. పాత వారితో పాటు కొత్త రేషన్ కార్డులు పొందిన వారు కూడా ఈ నెల 31 లోపు ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఈ కేవైసీ కోసం రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు కూడా తప్పనిసరి అని చెప్పారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలోని రేషన్ దుకాణాలలో ఈ వెసులుబాటును ప్రభుత్వం కల్పించిందన్నారు. ఈ కేవైసీ చేయించుకోని వారు రేషన్ బియ్యం అందుకోలేరని ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -