Tuesday, July 21, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఇంజినీరింగ్ విద్యా వ్యవస్థలో అక్రమాలను అరికట్టాలి

ఇంజినీరింగ్ విద్యా వ్యవస్థలో అక్రమాలను అరికట్టాలి

- Advertisement -

విద్యా ప్రమాణాలను కాపాడాలి
అధ్యాపకులకు న్యాయం చేయాలి : డీఏటీఏ సమావేశంలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్

ఇంజినీరింగ్ విద్యా వ్యవస్థలో అక్రమాలను అరికట్టాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో డెమెక్రటిక్ ఆల్ టీచర్స్ అసోసియేషన్ (డీఏటీఏ) గౌరవాధ్యక్షులు వెంకటదాసు అధ్యక్షతన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు మేధావులు, విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, న్యాయవాదులు, ఉద్యమకారులు, విద్యార్థి నాయకులు పాల్గొని మాట్లాడారు.
విద్యా ప్రమాణాలను కాపాడాలనీ, అధ్యాపకులకు న్యాయం చేయాలని వారు కోరారు. సమావేశంలో జస్టిస్ చంద్రకుమార్, మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు బాలరాజు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రాఫెసర్ విజయ్, హైకోర్టు అడ్వకేటు వెంకటరమణ, కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి ఆల్ ఇండియా కన్వీనర్ బండారు లక్ష్మయ్య, ఉస్మానియా యూనివర్సిటీ ప్రాఫెసర్ కె.శ్రీనివాసులు, ప్రాఫెసర్ అన్వర్ ఖాన్, డీఏటీఏ రాష్ట్ర అధ్యక్షులు మహ్మద్ మొహినొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంజినీరింగ్ విద్యను ప్రయివేటు యాజమాన్యాలు నాశనం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ మహ్మద్ మొహినొద్దీన్ ను తొలగించచడాన్ని ఖండించారు. ప్రయివేటు యాజమాన్యాలు యూజీసీ, ఏఐసీటీఈ నిబంధనలను కాలరాస్తున్నాయని విమర్సించారు. నిబంధనల మేరకు అధ్యాపకుల నియామకం చేపట్టడం లేదని ఆరోపించారు. అధ్యాపకులకు సరైన వేతనాలివ్వని ప్రయివేటు కాలేజీల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఒయు వీసీ ప్రయివేటు యాజమాన్యాలకు తొత్తుగా వ్యవహ రిస్తున్నారని ప్రొఫెసర్ వెంకటదాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -