నవతెలంగాణ-తాడూర్
నాగర్‌కర్నూల్ మండలం గగ్గలపల్లి శివారులో మిషన్ భగీరథ ప్రధాన పైప్‌లైన్ ఆదివారం మళ్లీ పగిలింది. వేల లీటర్ల తాగునీరు వృథాగా పోతుండగా, మల్కాపూర్, పులిజాల గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. తాగునీటి కోసం గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల మరమ్మతులు చేసిన అదే ప్రాంతంలో మళ్లీ లీకేజీ ఏర్పడటంతో మరమ్మతుల నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాత్కాలిక మరమ్మతులతో కాలం గడుపుతున్నారని గ్రామస్తుల ఆరోపిస్తున్నారు.
పైప్‌లైన్ తరచూ పగిలిపోవడంతో భారీగా తాగునీరు వృథా అవుతోందని. నీటి కొరత ఉన్న సమయంలో విలువైన తాగునీరు వృథా కావడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. పైప్‌లైన్‌ను పూర్తిస్థాయిలో మరమ్మతు చేసి మల్కాపూర్, పులిజాల గ్రామాలకు నిరంతరాయంగా తాగునీరు అందించాలని అధికారులు కు ఆయా గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.



