Tuesday, July 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పథకాలను, సౌకర్యాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

పథకాలను, సౌకర్యాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

- Advertisement -

– రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి 
ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన 
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందించే పథకాలను, సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు. సోమవారం వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ పథకంపై  రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ పథకంలో 125 మంది రైతులతో 125 ఎకరాలు పూర్తిగా సేంద్రియ పదార్థాలు ఉపయోగించి వ్యవసాయం చేసేలా వ్యవసాయ శాఖ అధికారులకు కృషి చేయాలన్నారు. రైతులందరు సేంద్రియ వ్యవసాయం చేసి భూమి ఆరోగ్యాన్ని , పర్యావరణాన్ని కాపాడుకొని అధిక నాణ్యమైన ఆరోగ్యకరమైన దిగుబడులు సాధించాలన్నారు. ఈ పథకం ద్వారా రైతులకు కిట్స్ పంపిణీ చేశారు. మండల వ్యవసాయ అధికారి బి. రాజు మాట్లాడుతు పకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించారు. సేంద్రియ పదార్థాల ఇన్పుట్స్ కూడా రైతులకు అందించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొల్లె నర్సయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చేర్మెన్ గడ్డం నర్సరెడ్డి, జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు టాక్కరి గంగాధర్, వ్యవసాయ విస్తీర్ణణ అధికారి సుభాష్, సుస్థిర వ్యవసాయ కేంద్రం అధికారులు శివసాయి, చింతశ్రీనివాస్, భార్గవ్, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -