నవతెలంగాణ-కుభీర్
మండలంలోని ఆయా గ్రామంలో వి బిజీ రాంజీ పథకం ద్వారా పామ్ పాండ్లు, ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని జలసిరి కార్యక్రమం ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం స్థానిక సర్పంచుల అధ్యక్షతన గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్బంగా ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శి లు గ్రామమలో ఉన్న ప్రతి ఇంటికి ఓ ఇంకుడు గుంత,పామ్ పాండ్లు, ఊట కుంటలు వీ బిజీ రాంజీ పథకంలో వీటిని నిర్మించుకోవాలని గ్రామస్తులకు సూచించడం జరిగింది. వీటి ద్వారా ఎల్ ని నో ప్రభావం వల్ల వర్షపు నీళ్లు వృధా పోకుండా ప్రతి నీటి బొట్టును సంరక్షించడంతో భూగర్భ జలాలు పెరిగి నీటిని సమరక్షించుకోవడం జరుగుతుంది. దింతో కుభీర్ గ్రామ పంచాయతీ లో 20మంది ఫామ్ పాండ్లు నిర్మించుకునేందుకు ధరకస్తులు ఇవ్వడం జరిగిందని మిగితా వారు కూడా నిర్మించుకునేందుకు దరఖాస్తులు చేసుకోవాలని చెప్పారు. అదే విదంగా కొందరు మహిళలు గ్రామ సభలో అరులైన పేద వారికి కాకుండా స్వంత ఇండ్లు ఉన్న వారికే మంజూరు చేస్తున్నారని మహిళలు అధికారులను నిలదీశారు. అదే విదంగా గ్రామంలో పాలు పనులకు సంబదించిన తీర్మానలు చేశారు.ఈ కార్యక్రమం లో ఎంపీడీఓ శ్రీనివాస్ స్థానిక సర్పంచులు వార్డ్ సభ్యులు పంచాయతీ కార్యదర్శి లు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఇంటికి ఇంకుడు గుంతను నిర్మించుకోవాలి: ఎంపీడీఓ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



