Tuesday, July 21, 2026
E-PAPER
Homeసినిమాసెన్సార్ అభినందనలు

సెన్సార్ అభినందనలు

- Advertisement -

హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా “కలర్ ఫొటో”, “బేబి” వంటి సినిమాలను ప్రేక్షకులకు అందించిన మేకర్స్ ఎస్ కేఎన్, సాయి రాజేశ్ కాంబోలో రూపొందుతున్న సినిమా ‘చెన్నై లవ్ స్టోరీ`.
అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఎస్ కేఎన్, సాయి రాజేశ్ నిర్మిస్తున్నారు.
సాయి రాజేశ్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ నెల 24న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు ఈ మూవీ రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్ర సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సినిమాకు సెన్సార్ నుంచి యు/ఎ సర్టిఫికేషన్ దక్కింది.
ఇటీవల వచ్చిన ప్రేమ కథల్లో ఈ సినిమా విభిన్నంగా ఉందని, కుటుంబం అంతా చూడగలిగే ఇలాంటి మంచి ప్రేమ కథలు మరిన్ని రావాలని సెన్సార్ సభ్యులు ప్రశంసించారు.
మరోవైపు మేకర్స్ అగ్రిసెవ్ ప్రమోషనల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ సినిమా ట్రైలర్ హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ సినిమాను ఈ నెల 23న ప్రీమియర్స్ నుంచే థియేటర్స్ లో ఎంజాయ్ చేసేందుకు అన్ని వర్గాల ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్ – దేవి పర్చూరి, ఆర్ట్ – భాస్కర్ ముదావత్, ఎడిటర్ – సంతోష్ నాయుడు, డీవోపీ – విశ్వాస్ డేనియల్, లిరిక్స్ – అనంత్ శ్రీరామ్, మ్యూజిక్ డైరెక్టర్ – మణిశర్మ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – విశాల దాట్ల, లైన్ ప్రొడ్యూసర్ -శ్యామ్ ప్రసాద్ మేక.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -