Tuesday, July 21, 2026
E-PAPER
Homeసినిమాఅందమైన ప్రేమకథ..

అందమైన ప్రేమకథ..

- Advertisement -


సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న కుమారుడు జై కృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘శ్రీనివాస మంగాపురం’. అలాగే ఈ సినిమాతో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానిని కూడా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు.
అజయ్ భుపతి దర్శకత్వంలో నిర్మాత పి. కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అశ్విని దత్ సమర్పిస్తున్నారు.
తాజాగా మేకర్స్ ఈ చిత్రం నుంచి ‘రావే చెలియా` పాటని లాంచ్ చేశారు. జీవీ ప్రకాశ్ కుమార్ ఈ పాటను ప్రేమ, భావోద్వేగాలతో హార్ట్ టచ్చింగ్ మెలోడీగా కంపోజ్ చేశారు. నాగ్ అర్జున్ రెడ్డి అందించిన మనసుని తాకే సాహిత్యా నికి, కపిల్ కపిలన్ తన గాత్రంతో ప్రాణం పోశారు. ప్రేమ, ఎడబాటు, మనసులోని భావాలను ఈ పాట అద్భుతంగా పలికించింది. ఈ పాటలో జై కృష్ణ, రాషా తడానీ మధ్య ప్రేమ, దూరమైనప్పుడు కలిగిన ఎమోషన్స్ ప్రేక్షకులను హత్తుకున్నాయి. విజువల్స్ కూడా పాటలోని భావోద్వేగాన్ని మరింత ఎలివేట్ చేశాయి. అజయ్ భూపతి తన మార్క్ ఇంటెన్సిటీకి అందమైన ప్రేమకథ, పవర్‌ఫుల్ యాక్షన్‌ను జోడిస్తూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఈనెల 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -