Sunday, September 20, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సమగ్ర ప్రణాళికలు

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సమగ్ర ప్రణాళికలు

- Advertisement -


ఆరుతడి పంటల సాగుపై 
విస్తృత అవగాహన కల్పించాలి
ప్రజలపై కరువు ప్రభావం పడకుండా చర్యలు : రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి 
దామోదర రాజనరసింహ
నవతెలంగాణ -మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి/మహబూబ్‌నగర్

​ ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడం కోసం సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ అన్నారు. సోమవారం మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌లో ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రూపొందించిన ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళిక, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షపాతం గణనీయంగా తగ్గే అవకాశాలున్న నేపథ్యంలో రైతులు, ప్రజల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రకృతి విపత్తులను ముందుగానే అంచనా వేసి, వాటి ప్రభావాన్ని తగ్గించే దిశగా ప్రభుత్వం ఇప్పటికే సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసిందని తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన అధికారులు సమిష్టి బాధ్యతతో పనిచేసి తెలంగాణకు మార్గదర్శకంగా నిలవాలన్నారు. క్షేత్రస్థాయిలో రైతులకు భరోసా కల్పించే చర్యలు చేపట్టాలన్నారు. వర్షాభావ ప్రభావం ప్రజలపై పడనీయొద్దన్నారు. ఇరిగేషన్, మిషన్‌భగీరథ, వ్యవసాయ, విద్యుత్, పశుసంవర్ధక ఇతర శాఖలు అప్రమత్తంగా ఉండి సమన్వయంతో ముందుకెళ్లాలని ఆదేశించారు. జులై చివరి నాటికి శాఖల వారీ కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ప్రజల్లో అనవసర ఆందోళన కలగకుండా శాస్త్రీయ సమాచారం అందించాలన్నారు. సమావేశంలో ప్రణాళిక సంఘం వైస్ చైర్మెన్, ఎల్‌నినో ఎక్స్‌పర్ట్ కమిటీ చైర్మెన్ జి. చిన్నారెడ్డి, స్పెషల్ ఆఫీసర్ షఫీ ఉల్లా, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జి మధుసూధన్ రెడ్డి, జె అనిరుధ్ రెడ్డి. కూచుకుళ్ళ రాజేశ్ రెడ్డి, తూడి మేఘారెడి, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, వీర్లపల్లి శంకర్, విజయుడు, కలెక్టర్లు ఖుష్బూ గుప్తా, ఆదర్శ్ సురభి, సిహెచ్. ప్రియాంక, షేక్ రిజ్వాన్ భాషా, హేమంత్ కేశవ్ పాటిల్, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మెన్ ఒబెదుల్లా కొత్వాల్, స్పోర్ట్ అథారిటీ చైర్మెన్ శివసేనా రెడ్డి, గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మెన్ సరిత, మహబూబ్ నగర్ మేయర్ జి.మమత, మున్సిపల్ చైర్మెన్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -