Tuesday, July 21, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం‌ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జీ సిగ్గుచేటు : కేటీఆర్‌

‌ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జీ సిగ్గుచేటు : కేటీఆర్‌

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు లాఠీచార్జీ చేయడం అత్యంత ప్రజాస్వామ్య విరుద్ధమైనదనీ, సిగ్గుచేటని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌విమర్శించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌ ‌ద్వారా సోమవారం స్పందించారు. లాఠీలు, టియర్ గ్యాస్‌తో ప్రశ్నలకు సమాధానం చెప్పలేరని తెలిపారు. రాజ్యాంగం ప్రతి పౌరుడికీ ప్రశ్నించే హక్కును కల్పించిందనీ, ఆ హక్కును బలప్రయోగంతో అణచివేయలేరని పేర్కొన్నారు. పోలీసుల లాఠీచార్జీని తీవ్రంగా ఖండించారు. విభేదించే స్వరాలను అణచివేయడం కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆపాలని డిమాండ్‌ ‌చేశారు. జవాబుదారీతనం కోసం పోరాడుతున్న ప్రతి విద్యార్థికీ, ప్రతి పౌరుడికీ ఆయన సంఘీభావం ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -