Wednesday, July 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కేంద్ర విద్యాశాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేయాలి

కేంద్ర విద్యాశాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేయాలి

- Advertisement -

 నవతెలంగాణ-ఆలేరు టౌన్ 
నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రెన్స్  టెస్ట్ (నీట్) ప్రశ్న పత్రం లీకేజీకి పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బే శరత్ గా తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని సీపీఐ ఎం.ఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆర్.జనార్ధన్ కేంద్ర బీ జే పీ మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

జూలై 20 న డిల్లీలో నీట్ పేపర్ కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ,ఆలేరు  పట్టణంలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నల్ల జెండాలతో  రైల్వే గేట్ సెంటర్ లో నిరసన తెలియజేశారు.

ఈ సందర్భంగా జనార్ధన్ మాట్లాడుతూ దేశంలో ప్రజలపై ఏమాత్రం బాధ్యత చూపని మోడీ ప్రజా వ్యతిరేక ప్రభుత్వం, విద్యార్థులు లక్షలు లక్షలు ఖర్చుపెట్టి కోచింగ్ లు తీసుకొని,ఎంతో కష్టపడి నీట్ కు సిద్ధమై పరీక్షకు పోతే నీట్ పేపర్ ను కోట్ల రూపాయల కు లాలూచీపడిన బీ జే పీ కేంద్ర ప్రభుత్వం నీట్ ప్రశ్న పత్రాన్ని లీక్ చేసి విద్యార్థుల భవిష్యత్ ను నాశనం చేయపూనుకున్నదని ఆరోపించారు.

ఈ కార్యక్రమంలో ఏ ఐ కె ఎం ఎస్ జిల్లా అధ్యక్షులు కల్లెపు అడివయ్య, పీ ఓ డబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు ఆర్.సీత, జిల్లా ప్రధాన కార్యదర్శి మాలోత్ సుగుణ, ఏ ఐ కే ఎం ఎస్ జిల్లా నాయకులు మాలోత్ మోతిలాల్, అరుణోదయ జిల్లా నాయకులు ఇక్కిరి శ్రీనివాస్, నాయకులు ఇక్కిరి బీరయ్య, వంగాల నర్సింహారెడ్డి,నమిలే స్వామి,దార యాదగిరి,చింతకింది సత్యనారాయణ ,మేకల వెంకటేష్, అక్కపాక యాదగిరి,మహిళలు దొంకెన లక్ష్మీనర్సమ్మ, కొమ్మిడి లత  అండాలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -