Wednesday, July 22, 2026
E-PAPER
Homeసినిమా'సర్దార్ 2' రిలీజ్ డేట్ ఫిక్స్

‘సర్దార్ 2’ రిలీజ్ డేట్ ఫిక్స్

- Advertisement -


తమిళం, తెలుగు భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘సర్దార్’కి సీక్వెల్ ‘సర్దార్ 2’తో హీరో కార్తి ప్రేక్షకులు ముందుకు రానున్నారు. ప్రీక్వెల్‌కి దర్శకత్వం వహించిన పిఎస్ మిత్రన్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్, ఐవీ ఎంటర్‌టైన్‌ మెంట్స్ గ్రాండ్ గా నిర్మిస్తోంది. ఈ చిత్రంలో ఎస్.జే. సూర్య కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. నీలం రంగు సూట్‌లో స్టైలిష్ లుక్‌తో మెట్లపై నిలబడి కనిపించిన ఎస్.జే. సూర్య పోస్టర్‌లో ఎంతో క్లాసీగా, మిస్టీరియస్‌గా కనిపిస్తున్నారు.
బ్యాక్‌డ్రాప్‌లో ఉన్న భారీ డ్రాగన్ ఆర్ట్‌వర్క్, డార్క్ టోన్, షేడ్స్‌తో కూడిన ఆయన లుక్ పాత్రపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఈ పోస్టర్‌ను బట్టి ‘సర్దార్ 2’ లో ఎస్.జే. సూర్య పాత్ర కథలో అత్యంత కీలకంగా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో మాళవిక మోహన్, ఆషికా రంగనాథ్, రజిషా విజయన్ ఫిమేల్ లీడ్స్ కాగా, ఎస్ జె సూర్య ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకి దర్శకత్వం – పిఎస్ మిత్రన్, సహ నిర్మాత – ఎ. వెంకటేష్, నిర్మాతలు – ఎస్. లక్ష్మణ్ కుమార్, ఇషాన్ సక్సేనా, సంగీతం – సామ్ సిఎస్, డీఓపీ – జార్జ్ సి విలియమ్స్, ఎడిటర్ – విజయ్ వేలుకుట్టి, ప్రొడక్షన్ డిజైన్ – రాజీవ్ నంబియార్.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -