Wednesday, July 22, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలు‌కేంద్ర నిధుల సమీకరణకు కార్యాచరణ

‌కేంద్ర నిధుల సమీకరణకు కార్యాచరణ

- Advertisement -

అసెంబ్లీ, మండలి సమావేశాలకు సమాయత్తం కావాలి :అధికారులకు సీఎస్‌‌ సంజయ్‌‌జాజు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన కేంద్ర నిధుల సమీకరణకు తగు కార్యాచరణ‌ను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌‌లోని సచివాలయంలో ఇదే అంశంపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వనరుల సమీకరణపై దృష్టి సారించాలని కోరారు. యుటిలైజేషన్ సర్టిఫికెట్లు, నివేదికలు, ప్రతిపాదనలను సకాలంలో కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలని సూచించారు. తద్వారా అక్కడి నుంచి నిధులు విడుదల కావడానికి మార్గం సుగమం అవుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా సీఎస్ గ్రూప్ కో ఆర్డినేషన్ సమావేశాలు నిర్వహించి ఆర్థిక వనరుల సమీకరణ, శాఖల సమన్వయం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అమలు చేస్తున్న పథకాలు, నిధుల సమీకరణ పెంపొందించే చర్యలు చేపట్టాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలు, సాధించిన పురోగతి తదితర అంశాలపై అధికారులకు ఆయన దిశా నిర్దేశం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, వాటి పురోగతి తదితర అంశాలన్నింటినీ ఎప్పటికప్పుడు సీఎం డ్యాష్ బోర్డులో పొందుపరిచి,
అంతర్గత అంశాలపై సమీక్షించాలని సూచించారు. రానున్న అసెంబ్లీ సమావేశాలకు సమాయత్తం కావాలని అధికారులను ఆదేశించారు. అసెంబ్లీ ఎజెండా ప్రకారం సమాచారాన్ని సిద్ధం చేసుకోవాలని సూచించారు. సమీక్షా సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు మహేశ్ దత్ ఎక్కా, నవీన్ మిట్టల్, ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీం, షీకా గోయల్, స్టీఫెన్ రవీంద్ర, కార్యదర్శులు ఇలంబర్తి, సురేంద్ర మోహన్, గౌరవ్‌ ఉప్పల్, సిక్తా పట్నాయక్, లోకే‌శ్‌ కుమార్, రాజీవ్ గాంధీ హనుమం‌తు, కృష్ణ ఆదిత్య, దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు, వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి, ఐటీ శాఖ ప్రత్యేక కార్యదర్శి అనుదీప్, న్యాయశాఖ కార్యదర్శి పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -