నవతెలంగాణ-మరికల్
మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న 25 దుకాణాలను కార్యదర్శి మల్లేష్ గురువారం ఖాళీ చేయించారు. ఈ విషయమై ఆయన నవతెలంగాణతో మాట్లాడుతూ.. గత మార్చి నెలలో గ్రామ పంచాయతీ పరిధిలో 25 దుకాణాలను టెండర్ల ద్వారా దక్కించుకున్న వారికి అప్పగించామని పేర్కొన్నారు. అయితే వారు మార్చి నుంచి జూలై వరకు ఆ దుకాణాలకు అద్దె చెల్లించలేదని తెలిపారు. ఈ నెలలో 15 రోజుల ముందు ఖచ్చితంగా దుకాణాల కిరాయి చెల్లించాలని నోటీసులు కూడా జారీ చేశామని చెప్పారు. అయినా ఇప్పటివరకు ఏ ఒక్కరూ స్పందించలేదనీ, అద్దె కూడా చెల్లించలేదని ఆయన వెల్లడించారు. దీంతో మండలాధికారుల ఆదేశాల మేరకు నేడు టెండర్లలో దక్కించుకున్న 25 దుకాణాలను ఖాళీ చేయించాల్సొచ్చిందని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో కార్యదర్శితో పాటు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
25 దుకాణాలను ఖాళీ చేయించిన కార్యదర్శి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



