నవతెలంగాణ-మద్నూర్
గత వారం మండల పరిధిలోని ఫర్టిలైజర్ దుకాణాలను ఏఓ రాజు సందర్శించి, రైతులకు ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరలకు ఎరువులను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవనీ, అమ్మిన ప్రతి వస్తువుకు తప్పనిసరిగా రశీదు ఇవ్వాలని హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే మండల ఫర్టిలైజర్ దుకాణ యజమానులు అధికారులు ఆదేశాలను తుంగలో తొక్కి, రైతులకు ఎంఆర్పీ కంటే అధిక ధరలకు ఎరువులను విక్రయిస్తున్నారు. ఈ మోసం ఎక్కడ తెలిసిపోతుందో అనే భయంతో ఒరిజినల్ రశీదులు ఇవ్వకుండా చిత్తు కాగితాలపై అమ్మిన డేట్, రైతు చెల్లించిన అమౌంట్ వేసి ఇస్తున్నారు. ఇదిలా ఉండగా.. యూరియా ఆన్ లైన్ లో అమ్ముతూ.. ప్రతి బస్తాపై రూ.50 అదనంగా వసూలు చేస్తున్నారని నష్టపోతున్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఏఓ రాజును నవతెలంగాణ వివరణ కోరగా..రాతపూర్వకంగా రైతులు ఫిర్యాదు చేస్తే ఫర్టిలైజర్ దుకాణ దారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
చిత్తు కాగితాలే రశీదులు.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



